మమతా బెనర్జీ కారుపై దాడి.. రాళ్లు, ఇటుకలు విసిరిన దుండగులు..
ABN , Publish Date - Aug 09 , 2026 | 05:39 PM
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. ఉత్తర 24 పరగణాల జిల్లా హాలిసహర్‌లో ఓ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఆమెపై దాడి జరిగింది.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. ఉత్తర 24 పరగణాల జిల్లా హాలిసహర్‌లో ఓ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఆమెపై దాడి జరిగింది. టీఎంసీ అధినేత్రి కారును గుర్తుతెలియని కొంతమంది వ్యక్తులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. ఇటుకలు, రాళ్లు, బురదతో దాడికి తెగబడ్డారు. పోలీసులు రక్షణ కల్పిస్తున్నప్పటికీ వారిని దాటుకుంటూ వెళ్లి మరీ దాడి చేశారు.
ఈ ఘటనపై మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేశారు. 'పోలీసుల కళ్లెదుటే బయటి నుంచి వచ్చిన సంఘవిద్రోహ శక్తులు నా కారుపై దాడి చేశారు. పెద్దపెద్ద రాళ్లు, ఇటుకలు, బురద విసిరారు. ఒకవేళ కారు కిటికీలు తెరిచి ఉంటే నా తల పగిలిపోయేది. నేను చనిపోయి ఉండేదాన్ని. ఇంతటి దాడిని నేను ఎప్పుడూ ఎదుర్కోలేదు. మమ్మల్ని కాపాడేందుకు పోలీసులు ఏమీ చేయలేదు. వాళ్లు కేవలం బీజేపీకి మాత్రమే రక్షణ కల్పిస్తారు' అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, పోలీసు కస్టడీలో మరణించిన టీఎంసీ కౌన్సిలర్ భర్త బిర్జు కియోత్ కుటుంబాన్ని కలిసేందుకు టీఎంసీ అధినేత్రి నేడు హాలిసహర్‌కి వెళ్లారు.
మరోవైపు, మమతా బెనర్జీపై దాడిని పశ్చిమ బెంగాల్ బీజేపీ ఖండించింది. ఈ హింసాకాండతో తమకు ఎలాంటి సంబంధం లేదని పార్టీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయం తర్వాత మమతా మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీపైనా దాడి జరిగింది. నెలల వ్యవధిలోనే టీఎంసీ అధినేత్రిపైనా దాడి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
ఈ వార్తలు కూడా చదవండి
బారామతిలో మరో విమాన ప్రమాదం.. పైలట్లకు తప్పిన ప్రాణాపాయం..
మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి..