Share News

ఐబీ కొత్త డైరెక్టర్‌ మహేశ్‌ దీక్షిత్‌

ABN , Publish Date - Jun 27 , 2026 | 06:34 AM

దేశ అంతర్గత భద్రతలో అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) కొత్త డైరెక్టర్‌ జనరల్‌గా ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన 1993 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికా...

ఐబీ కొత్త డైరెక్టర్‌ మహేశ్‌ దీక్షిత్‌

  • ఏపీ క్యాడర్‌ ఐపీఎ్‌సకు ప్రతిష్ఠాత్మక పోస్టు

న్యూఢిల్లీ/ హైదరాబాద్‌, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): దేశ అంతర్గత భద్రతలో అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) కొత్త డైరెక్టర్‌ జనరల్‌గా ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన 1993 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి మహేశ్‌ దీక్షిత్‌ నియమితులయ్యారు. ప్రస్తుత డైరెక్టర్‌ తపన్‌ స్థానంలో ఆయనను నియమిస్తూ ప్రధాని నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్‌ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30వ తేదీన ఐబీ చీఫ్‌గా దీక్షిత్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ పదవిలో ఆయన రెండేళ్లు లేదా ప్రభుత్వం తదుపరి ఆదేశాలు జారీచేసేవరకు ఉంటారు. మహేశ్‌ దీక్షిత్‌ ప్రస్తుతం ఐబీ స్పెషల్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. మహారాష్ట్రకు చెందిన మహేష్‌ ఉమ్మడి ఏపీలో.. 1995లో బెల్లంపల్లి ఏఎస్పీగా, 1996లో నిజామాబాద్‌ ఏఎస్పీగా, 1997లో కరీంనగర్‌ అదనపు ఎస్పీగా పనిచేశారు. 1999లో విశాఖపట్నం ఎస్పీగా నియమితులైన తర్వాత కేంద్ర సర్వీసులోకి వెళ్లారు.

ఇవి కూడా చదవండి

విగ్ కారణంగానే కేతన్ హత్య.. తండ్రి ఏమన్నారంటే..

Updated Date - Jun 27 , 2026 | 06:34 AM