Share News

మహారాష్ట్రలో షాకింగ్ ఘటన.. మహిళా డాక్టర్‌పై దాడి

ABN , Publish Date - Oct 23 , 2026 | 09:53 PM

మహారాష్ట్రలో ఓ మహిళా డాక్టర్‌పై దాడి ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మహారాష్ట్రలో షాకింగ్ ఘటన.. మహిళా డాక్టర్‌పై దాడి
Maharashtra woman doctor attacked

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలో ఓ మహిళా డాక్టర్‌పై దాడి ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాలేగావ్ శ్యామ్‌జీపంత్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. మెడికో లీగల్ కేసుకు సంబంధించి పోలీసులు వైద్య పరీక్ష కోసం తీసుకొచ్చిన ఓ వ్యక్తి అక్కడి మహిళా డాక్టర్‌పై అకస్మాత్తుగా చేయి చేసుకున్నాడు. ఇలా ఎందుకు చేశాడనేది మాత్రం తెలియరాలేదు.


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, వైద్య పరీక్షలు పూర్తయ్యాక ఆ డాక్టర్ సంబంధిత డాక్యుమెంట్స్‌పై సంతకాలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు తీసుకువచ్చిన వ్యక్తి ఆమె ఎదురుగా కూర్చున్నాడు. పక్కనే ఓ పోలీసు కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఆ డాక్టర్ సంతకాలు చేయమని ఆ వ్యక్తికి పెన్ను ఇచ్చారు. సంతకం చేసిన తరువాత అతడు అకస్మాత్తుగా డాక్టర్‌పై చేయి చేసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసు అతడిని నిలువరించి గది నుంచి బయటకు లాక్కెళ్లారు.

ఈ ఘటనపై స్థానిక వైద్య సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాసేపు నిరసనకు దిగారు. డాక్టర్‌పై చేయి చేసుకున్న వ్యక్తి మరో మహిళపై బ్లేడుతో దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు తెలిపారని వార్ధా జిల్లా వైద్యాధికారి తెలిపారు. పోలీసులు ఆ వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

ఢిల్లీ విమానాశ్రయంలో 3 గంటల పాటు నిర్బంధం.. కేంద్రంపై పంజాబ్ సీఎం తీవ్ర ఆరోపణలు

రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలు.. శశీ థరూర్ కౌంటర్

Updated Date - Oct 23 , 2026 | 10:00 PM