Share News

ఆ మంత్రి రాజీనామా చేయాలి.. అభిజీత్ దీప్కే డిమాండ్

ABN , Publish Date - Aug 20 , 2026 | 09:40 PM

మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి దాదా భూసే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు.

ఆ మంత్రి రాజీనామా చేయాలి.. అభిజీత్ దీప్కే డిమాండ్
Abhijit Deepke

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి దాదా భూసే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని స్కూళ్లల్లో మౌలిక వసతుల సరిగా లేని వైనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వారం ప్రారంభించిన స్కూల్ ఠీక్ కరో కార్యక్రమంలో భాగంగా తాజాగా ఆయన లాతూర్ జిల్లాలోని ఉజనీ గ్రామంలోని జిల్లా పరిషత్ స్కూల్‌ను సందర్శించారు.

స్కూళ్లల్లో సరైన తరగతి గదులు, బెంచీలు, టాయిలెట్లు, స్కూళ్లకు వెళ్లేందుకు భద్రమైన రోడ్లు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మౌలిక వసతులు లేకుండా పిల్లలు ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు. స్కూళ్ల పరిస్థితి సరిగా లేని తీరుపై ప్రజాప్రతినిధులే బాద్యత వహించాలని అన్నారు. విద్యాశాఖకు వారు తగిన ప్రాధాన్యం ఇచ్చేలా ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. కొన్ని స్కూళ్లల్లో పిల్లల పరిస్థితి జంతువుల కంటే దారుణంగా ఉందని అన్నారు.


విద్యార్థులకు ఎలాంటి మంచీ చేయలేని రాజకీయ నాయకులకు ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. వాళ్లు ప్రజాప్రతినిధులు అయ్యాక హెలికాప్టర్లలో తిరుగుతారని ఓటు వేయాలా అని ప్రశ్నించారు. తమ పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో చదువుకుంటున్నారో ప్రజలు పరిశీలించుకోవాలని అన్నారు. ప్రజాప్రతినిధుల ఇళ్లల్లోని పెంపుడు జంతువులకు ఇంతకంటే మంచి వసతులు ఉన్నాయని అన్నారు. విద్యాశాఖపై దృష్టిపెట్టాలని తమ గ్రామానికి వచ్చే ప్రతి నేతనూ కోరాలని ప్రజలకు సూచించారు.


ఈ వార్తలనూ చదవండి:

ఫ్రస్ట్రేషన్‌లో అలా అన్నా.. సారీ.. భారత ఆర్మీకి యువతి క్షమాపణ

‘నా యవ్వనం గురించి పగటి కలలు కనకండి’.. రామ్‌దేవ్‌కు కంగనా రనౌత్‌ స్ట్రాంగ్ కౌంటర్‌

Updated Date - Aug 20 , 2026 | 09:51 PM