Share News

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, 20 మందికి తీవ్ర గాయాలు..

ABN , Publish Date - Nov 14 , 2026 | 10:08 AM

దేశంలో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. శుక్రవారం అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో 26 మంది మృతిచెందిన ఘటన మరువక ముందే తాజాగా మరో ప్రమాదం జరిగింది.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, 20 మందికి తీవ్ర గాయాలు..
Maharashtra Bus Accident

ముంబై, నవంబర్ 14: దేశంలో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. నిన్న (శుక్రవారం) అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో 26 మంది మృతిచెందిన ఘటన మరువక ముందే తాజాగా మరో ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో ఓ ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. అతివేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి వంతెనను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళా ప్రయాణికురాలు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.


అప్రమత్తమైన స్థానికులు, ఇతర వాహనదారులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాజీరంగా నేషనల్ పార్క్ సమీపంలో అతి వేగంగా వెళ్తున్న మినీ బస్సు ఎదురుగా వస్తున్న కంటైనర్ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. అతివేగం కారణంగానే ఈ ఘోరం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.


అలాగే, శుక్రవారం అర్ధరాత్రి కేరళంలోని త్రిసూర్ జిల్లాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఎనిమిది మంది మృతిచెందారు. వారంతా తమిళనాడుకు చెందిన విద్యార్థులుగా పోలీసులు భావిస్తున్నారు. బాధితులు గురువాయూర్ నుంచి కొడుంగల్లూరుకు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి

కేరళంలో షాకింగ్ ఘటన.. ప్రియుడిని హత్య చేసేందుకు ప్రియురాలి యత్నం..

మోదీ ఫిలిప్పీన్స్ టూర్ ఖరారు.. రెండు కీలక సదస్సులకు హాజరుకానున్న ప్రధాని

Updated Date - Nov 14 , 2026 | 10:08 AM