Share News

బాలిక ఛాతిపై తన్నిన అంగన్‌వాడీ వర్కర్.. వీడియో వైరల్

ABN , Publish Date - Jun 26 , 2026 | 03:31 PM

మహారాష్ట్రలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక అంగన్వాడీ వర్కర్ బాలిక ఛాతిపై తన్నడంతో చిన్నారి మెట్లపై నుంచి దొర్లి పడిపోయింది. ఇందుకు సంబంధించి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బాలిక ఛాతిపై తన్నిన అంగన్‌వాడీ వర్కర్.. వీడియో వైరల్
Maharashtra Anganwadi Worker Kicks Child

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. అభంశుభం తెలియని ఒక బాలిక ఛాతిపై అంగన్‌వాడీ వర్కర్ తన్నడంతో చిన్నారి మెట్లపై నుంచి దొర్లి పడిపోయింది. రాయ్‌గఢ్ జిల్లా పన్వేల్‌లోగల నంద్‌గావ్ అంగన్‌వాడీ కేంద్రంలో తాజాగా ఈ దారుణం వెలుగు చూసింది. ఘటన గురించి సమాచారం అందగానే నవీ ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అంగన్‌వాడీ కేంద్రం వద్ద భద్రతా సిబ్బందిని కూడా మోహరించారు.

ఈ ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారుల సంరక్షణ బాధ్యతలు తీసుకున్న వ్యక్తే ఇలా క్రూరంగా ప్రవర్తించడంపై జనాలు మండిపడుతున్నారు. నిస్సహాయంగా ఉన్న చిన్నారిపై దాడి చేయడం దానవత్వం అంటూ విమర్శిస్తున్నారు. నిందితురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


ఇదిలా ఉంటే, మహారాష్ట్రలోని ఒక డేకేర్ సెంటర్‌లో నిర్వహకుల పర్యవేక్షణ లోపం కారణంగా ఒక బాలుడు మరో బాలుడిని కొట్టి, కొరికి తీవ్రంగా గాయపరిచాడు. ఛత్రపతి శంభాజీ నగర్‌లో ఈ దారుణం వెలుగు చూసింది. పిల్లలను పర్యవేక్షించాల్సిన సిబ్బంది బయటకు వెళ్లి బయటివైపు నుంచి తలుపులు వేయడంతో ఈ ఘటన జరిగింది. పిల్లాడు గాయపడిన విషాయన్ని అతడి తల్లికి తెలియకుండా దాచేందుకు నిర్వాహకులు ప్రయత్నించారు. ఆ తరువాత బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా రూ.10 లక్షల డబ్బు ఆశ చూపినట్టు కూడా జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ ఘటనపై విద్యాశాఖ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది.


ఈ వార్తలనూ చదవండి:

అయోధ్య నిధుల దుర్వినియోగం.. ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామా..

సనాతన ధర్మ నమ్మకంతో ఆడుకుంటే ఎవరినీ వదిలిపెట్టం: CM యోగి ఆదిత్యనాథ్

Updated Date - Jun 26 , 2026 | 03:53 PM