Share News

FCRA రిజిస్ట్రేషన్ నిరాకరణపై అప్పీలు..కొడైకెనాల్ జెన్ ధ్యాన ట్రస్టు వినతి కొట్టివేత

ABN , Publish Date - Oct 08 , 2026 | 01:53 PM

ఎఫ్‌సీఆర్ఏ చట్టం కింద రిజిస్ట్రేషన్‌ను కేంద్రం నిరాకరించడాన్ని సవాలు చేసిన కొడైకెనాల్ జెన్ ధ్యాన ట్రస్ట్‌కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది.

FCRA రిజిస్ట్రేషన్ నిరాకరణపై అప్పీలు..కొడైకెనాల్ జెన్ ధ్యాన ట్రస్టు వినతి కొట్టివేత
Madras High Court

ఇంటర్నెట్ డెస్క్: ఎఫ్‌సీఆర్ఏ చట్టం కింద రిజిస్ట్రేషన్‌ను కేంద్రం నిరాకరించడాన్ని సవాలు చేసిన కొడైకెనాల్ జెన్ ధ్యాన ట్రస్ట్‌కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. తమ కార్యకలాపాలకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించాల్సిన బాధ్యత రిజిస్ట్రేషన్‌ను కోరే సంస్థలపై ఉంటుందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో కోర్టు జోక్యానికి పరిమితులు ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ తీర్పు వెలువరించింది.


తాము మతపరమైన సంస్థ కాదని ట్రస్టు తన దరఖాస్తులో పేర్కొందని కోర్టు తెలిపింది. అదే సమయంలో, తాము జెన్ బౌద్ధ ఫిలాసఫీని అనుసరిస్తామని స్వయంగా ట్రస్టు పేర్కొందని చెప్పింది. మతపరమైన సంస్థలకు ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌కు హక్కు ఉన్నప్పటికీ దరఖాస్తుదారులు తమ కార్యకలాపాల గురించి కచ్చితమైన వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. దోబూచులు ఆడితే కుదరదని తేల్చి చెప్పింది. ధ్యాన కేంద్రం నిర్వహించినంత మాత్రాన తమను మతపరమైన సంస్థగా చూడకూడదని ట్రస్టు వాదించే ప్రయత్నం చేసింది. అయితే, కోర్టు మాత్రం కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది. ఈ నిర్ణయాన్ని సమీక్షించే అధికారానికి పరిమితులు ఉన్నాయని చెప్పింది. ట్రస్టు అప్పీలును కొట్టేసింది.


ఈ వార్తలనూ చదవండి:

సైబర్ ఫ్రాడ్‌ను అడ్డుకునేందుకు అంతర్జాతీయ వ్యవస్థ కావాలి: ప్రధాని మోదీ

రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు.. నానా పటేకర్ చివరి కామెంట్స్

Updated Date - Oct 08 , 2026 | 02:07 PM