Share News

పేరు, జాతీయత ఆధారంగా ‘హిందూ హోదా’ను కాదనలేరు

ABN , Publish Date - Jul 04 , 2026 | 06:19 AM

ఒక వ్యక్తి పేరు, జాతీయత ఆధారంగా హిందూ హోదాను తిరస్కరించలేరని, హిందూ మతంలోకి మారే వ్యక్తులకు ఎలాంటి వేడుకలు, సర్టిఫికెట్లు అవసరం లేదని మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు...

పేరు, జాతీయత ఆధారంగా ‘హిందూ హోదా’ను కాదనలేరు
Madras High Court

  • మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు

  • అమెరికా పౌరురాలు లారా ఫ్రాన్సె్‌సను హిందువుగా గుర్తించాలని స్పష్టీకరణ

చెన్నై, జూలై 3(ఆంధ్రజ్యోతి): ఒక వ్యక్తి పేరు, జాతీయత ఆధారంగా హిందూ హోదాను తిరస్కరించలేరని, హిందూ మతంలోకి మారే వ్యక్తులకు ఎలాంటి వేడుకలు, సర్టిఫికెట్లు అవసరం లేదని మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హిందువుగా మారాలని అనుకునే వారికి నమ్మకం, చిత్తశుద్ధి ఉంటే చాలని పేర్కొంది. అమెరికా పౌరురాలైన లారా ఫ్రాన్సెస్‌ అయ్యంగార్‌ను హిందువుగా గుర్తించడంతోపాటు హిందూ సంప్రదాయ మహిళగానే భావించాలని తేల్చిచెప్పింది. ఆలయ సంప్రదాయాలు, ఆగమశాస్త్రం ప్రకారం దేవాలయాల్లోకి ప్రవేశించే ఇతర హిందూ మహిళలకు ఉన్న హక్కులను లారాకు కూడా వర్తింపజేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ డి. భరత్‌ చక్రవర్తి నేతృత్వంలోని మదురై ధర్మాసనం తీర్పు చెప్పింది. కాగా, తాను హిందూమతం స్వీకరించి, హైందవ సంప్రదాయాన్ని ఆచరిస్తున్నప్పటికీ తంజావూరు వరదరాజపెరుమాళ్‌ ఆలయంలోకి ప్రవేశించేందుకు నిరాకరిస్తున్నారని పేర్కొం టూ లారా ఫ్రాన్సెస్‌ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్‌ డి. భరత చక్రవర్తి నేతృత్వంలోని మదురై ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో తమిళనాడు హిందూ రెలిజియస్‌, చారిటబుల్‌ ఎండోమెంట్స్‌ విభాగం, లారా తరఫు వాదనలను, సాక్ష్యాధారాలను పరిశీలించింది. అనంతరం.. లారా ఫ్రాన్సె్‌సకు ఆలయాల్లోకి ప్రవేశించే హక్కు ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆమె ఆలయ ప్రవేశాన్ని అడ్డుకోవడం పట్ల రాష్ట్ర దేవదాయశాఖను తీవ్రంగా తప్పుబట్టింది.

ఈ వార్తలనూ చదవండి:

వీధులు శుభ్రం చేసినట్టు ఏఐ చిత్రాలు.. మున్సిపల్ సిబ్బందిపై వేటు

సింధు జలాలపై భారత్‌ కఠిన వైఖరి.. ఉగ్రవాదం ఆగేదాకా..

Updated Date - Jul 04 , 2026 | 06:58 AM