Share News

ఆటో డ్రైవర్ ఇంట్లో బయటపడిన రూ.3 కోట్లు.. సంచుల నిండా డబ్బులే..

ABN , Publish Date - Aug 17 , 2026 | 12:05 PM

ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో రూ.3 కోట్లు లభ్యమైన ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో చోటుచేసుకుంది. ఆటో డ్రైవర్ ఇంట్లో మారణాయుధాలు ఉన్నాయని సమాచారం రావడంతో పోలీసులు సోదా చేసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున నగదు సంచులు కనిపించడంతో ఆశ్చర్యానికి గురయ్యారు.

ఆటో డ్రైవర్ ఇంట్లో బయటపడిన రూ.3 కోట్లు.. సంచుల నిండా డబ్బులే..
Sagar Cash Seizure

మధ్యప్రదేశ్‌: ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో రూ.3 కోట్లు లభ్యమైన ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో చోటుచేసుకుంది. ఆటో డ్రైవర్ ఇంట్లో మారణాయుధాలు ఉన్నాయని సమాచారం రావడంతో పోలీసులు సోదా చేసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున నగదు సంచులు కనిపించడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి నగదును లెక్కించారు. అనంతరం దానిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


సాగర్‌లోని గోపాల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ రాజేశ్ అహిర్వార్ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతని కుమారుడు సౌరభ్ అహిర్వార్ ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేశాడు. తుపాకీతో దిగిన ఆ ఫొటో స్థానికులను భయాందోళనలకు గురి చేసింది. అతని వద్ద మారణాయుధాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగింది. దీంతో విషయం పోలీసులకు చేరింది. ఆటో డ్రైవర్ ఇంట్లో ఆయుధాలు ఉన్నాయన్న కారణంతో వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి ఇంటికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఎంత వెతికినా ఆయుధాలు లభించలేదు. అయితే, పెద్దఎత్తున నగదు సంచులు బయటపడ్డాయి.


ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో ఇంత పెద్దమొత్తంలో నగదు కనిపించడంతో పోలీసులు షాక్‌ అయ్యారు. వెంటనే నగదు లెక్కించే యంత్రాలను తెప్పించారు. సుమారు ఐదు గంటల పాటు శ్రమించి దాని విలువ రూ.3 కోట్లుగా తేల్చి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిందని ఆటో డ్రైవర్ కుటుంబాన్ని పోలీసులు ప్రశ్నించారు. అయితే, ఆ డబ్బుతో తమకు ఎలాంటి సంబంధం లేదని వారు తెలిపారు. భోపాల్‌లో ప్రభుత్వ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తమ బంధువు కుటుంబ సభ్యులదని వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

బిహార్‌లోని అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురి మృతి, పలువురికి గాయాలు..

పశ్చిమ బెంగాల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం..

Updated Date - Aug 17 , 2026 | 12:38 PM