‘మేడిన్ ఇండియా’ సీ-295 విమానం రెడీ!
ABN , Publish Date - Jun 12 , 2026 | 06:09 AM
భారతదేశ ఏరోస్పేస్, రక్షణ రంగ తయారీ లక్ష్యాల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర భారత్ కార్యక్రమాల కింద దేశీయంగా తయారైన తొలి సీ-295 సైనిక...
దేశీయంగా తయారీ.. తొలి పరీక్ష సక్సెస్
ఈ ఏడాదే వైమానిక దళానికి అందిస్తాం: ఎయిర్‌బస్
న్యూఢిల్లీ, జూన్ 11: భారతదేశ ఏరోస్పేస్, రక్షణ రంగ తయారీ లక్ష్యాల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర భారత్ కార్యక్రమాల కింద దేశీయంగా తయారైన తొలి సీ-295 సైనిక రవాణా విమానం విజయవంతంగా ఫ్లైట్ టెస్ట్ పూర్తి చేసుకుంది. ఎయిర్‌బ్‌సతో కలిసి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎ్‌సఎల్) గుజరాత్‌లోని వడోదరలో ఉన్న కేంద్రంలో ఈ విమానాన్ని తయారు చేశారు. భారత వైమానిక దళం కోసం 40సీ-295 రవాణా విమానాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. తొలి విమానం తయారై, తొలి పరీక్షను విజయవంతంగా పూర్తిచేసుకుంది. తొలి సీ-295 విమానాన్ని ఈ ఏడాదే భారత వైమానిక దళానికి అందజేయనున్నట్లు ఎయిర్‌బస్ డిఫెన్స్ సంస్థ తెలిపింది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో తొలిసారి సీ-295 సైనిక రవాణా విమానాన్ని దేశీయంగా తయారు చేయడం కీలక మైలురాయి అని పేర్కొంది. ఈ ఘనత సాధించిన బృందాలకు భారత వైమానిక దళం అభినందనలు తెలిపింది. భారత ఏరోస్పేస్ సామర్థ్యాల వృద్ధికి ఇది నిదర్శనమని వివరించింది. కేంద్ర ప్రభుత్వం 2021 సెప్టెంబరులో రూ.21,935 కోట్లతో 56 సీ-295 రవాణా విమానాల కొనుగోలుకు స్పెయిన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 16 విమానాలు నేరుగా స్పెయిన్ నుంచి దిగుమతి అవుతాయి. 40 విమానాలను భారత్‌లో తయారు చేస్తారు.
ఇవి కూడా చదవండి..
పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..
మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..