Share News

యూనిట్‌ విద్యుత్‌కు రూ.2 సబ్సిడీ

ABN , Publish Date - Mar 15 , 2026 | 06:42 AM

ఎల్‌పీజీ గ్యాస్‌ కొరతను అధిగమించేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది...

యూనిట్‌ విద్యుత్‌కు రూ.2 సబ్సిడీ

  • తమిళనాడులో హోటళ్లు, టీ షాపులకు ప్రభుత్వం ఊరట

చెన్నై, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ఎల్‌పీజీ గ్యాస్‌ కొరతను అధిగమించేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఎలక్ర్టిక్‌ స్టవ్‌లను ఉపయోగించే హోటళ్లు, రెస్టారెంట్లు, టీషాపులు, క్లౌడ్‌కిచెన్‌లు సహా ఆహార తయారీ సంస్థలకు యూనిట్‌ విద్యుత్‌కు రూ.2 సబ్సిడీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కేంద్రప్రభుత్వం ప్రకటించిన వాణిజ్య గ్యాస్‌ వినియోగ పరిమితులు అమలులో ఉన్న కాలానికి ఈ సబ్సిడీ వర్తించేలా సీఎం స్టాలిన్‌ చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని 60వేలకు పైగా పరిశ్రమలు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అనుమతి లేదా లైసెన్స్‌ లేకుండా కిరోసిన్‌, ఆర్డీఎఫ్‌, హెచ్‌ఎస్టీ, బయోమాస్‌ తదితర ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించుకునే వెసలుబాటును కల్పించారు. రేషన్‌షాపుల ద్వారా కార్డుదారులకు ఈ నెల అదనపు కిరోసిన్‌ అందించాలని కూడా సీఎం ఆదేశించారు.

ఇవి కూడా చదవండి...

గ్యాస్‌ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ

కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవితో మంత్రి సీతక్క భేటీ.. చర్చించిన అంశాలివే

Updated Date - Mar 15 , 2026 | 07:17 AM