13 శాతం తగ్గిన ఎల్పీజీ వినియోగం
ABN , Publish Date - Apr 20 , 2026 | 06:58 AM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు భారత్‌లో వంటగ్యాస్ (ఎల్పీజీ) వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చమురు సరఫరాలో అంతరాయం కారణంగా...
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో భారత్‌లో ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు భారత్‌లో వంటగ్యాస్ (ఎల్పీజీ) వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చమురు సరఫరాలో అంతరాయం కారణంగా భారత్‌లో మార్చి నెలలో ఎల్పీజీ వినియోగం 13ు మేర పడిపోయింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఎల్పీజీ వినియోగం 2.729 మిలియన్ టన్నుల నుంచి 2.379 మిలియన్ టన్నులకు చేరినట్లు పీపీఏసీ వెల్లడించింది. పీపీఏసీ వివరాల ప్రకారం.. గృహ అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ల అమ్మకాలు 8.1ు తగ్గగా, వాణిజ్య సిలిండర్ల అమ్మకాలు 48ు, బల్క్ ఎల్పీజీ అమ్మకాలు భారీగా 75.5ు క్షీణించాయి. యుద్ధం ప్రభావంతో దేశంలో చమురు కొరత ఏర్పడుతుందన్న ఆందోళనలతో పెట్రోల్, డీజిల్‌కు డిమాండ్ బాగా పెరిగింది. మార్చిలో పెట్రోల్ అమ్మకాలు 7.6 శాతం పెరిగి 3.78 మిలియన్ టన్నులకు చేరగా, డీజిల్ వినియోగం 8.1 శాతం పెరిగి 8.727 మిలియన్ టన్నులకు చేరింది.
ఈ వార్తలనూ చదవండి:
శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ
భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్‌గా మారిన ఆడియో