భారతీయులపై జీవనశైలి దెబ్బ!
ABN , Publish Date - Apr 23 , 2026 | 05:49 AM
భారత్‌లో ఆరోగ్య పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు అంటువ్యాధులు తగ్గుముఖం పడుతుండగా.. మరోవైపు జీవనశైలిలో మార్పుల కారణంగా వచ్చే వ్యాధులు...
దేశ జనాభాలో దాదాపు సగం మందికి బీపీ, షుగర్, గుండె జబ్బులు, థైరాయిడ్
ఆందోళన రేపుతున్న జీవనశైలి వ్యాధులు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: భారత్‌లో ఆరోగ్య పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు అంటువ్యాధులు తగ్గుముఖం పడుతుండగా.. మరోవైపు జీవనశైలిలో మార్పుల కారణంగా వచ్చే వ్యాధులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. దేశ జనాభాలో దాదాపు సగం మంది అధిక రక్తపోటు, గుండె జబ్బులు, మధుమేహం, థైరాయిడ్ వంటి.. హృదయ, జీవనశైలి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది. పదేళ్ల క్రితం ఇది 31ు ఉండగా.. 2015 నాటికి అది 19ు పెరిగి 50 శాతానికి చేరుకుంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం.. 2017 జూలై నుంచి 2018 జూన్ మధ్య 16.7ు మంది హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్టు గుర్తించగా.. 2025 నాటికి ఆ సంఖ్య 25.6 శాతానికి పెరిగింది. అలాగే.. 2017-18 మధ్య జీవక్రియ, అంతఃస్రావ గ్రంథుల రుగ్మతలతో బాధపడుతున్న వారు 15ు ఉండగా.. 2015 నాటికి అది 24.2 శాతంగా నమోదైంది. ఇవన్నీ 45 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే దీనికి భిన్నం గా.. 2025లో జ్వరం, కామెర్లు, అతిసారం వంటి అనారోగ్యాలతో సహా వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు గురైనవారు 15ు మంది ఉన్నారు. 2017-18లో ఈ తరహా కేసులు 32ు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్యలో భారీ తగ్గుదల కనిపించింది. 14 ఏళ్లలోపు వయసున్న పిల్లల్లో వస్తున్న అనారోగ్యాల్లో సగం కంటే ఎక్కువ భాగం ఇన్ఫెక్షన్ల వల్లే సంభవిస్తున్నాయి. తాజా సర్వే సమయంలో గత 15 రోజుల్లో అనారోగ్యానికి గురైనట్లు 13ు మంది నివేదించారు. 2017-18లో జరిగిన సర్వేలో ఈ శాతం 7.5గా ఉంది. పురుషుల (11.8ు) కంటే మహిళలు (14.4ు) ఎక్కువగా అనారోగ్యం పాలవుతున్నట్టు గుర్తించారు. దేశవ్యాప్తంగా దాదాపు 1.4 లక్షల కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు వైద్య ఖర్చుల భారం కూడా దాదాపు 70 శాతం పెరిగినట్టు సర్వేలో గుర్తించారు.2017-18లో ఆస్పత్రిలో చేరిన ప్రతి సందర్భంలోనూ సగటున రూ.20,135 ఖర్చు చేయాల్సి రాగా.. 2025లో అది రూ.34,064కు పెరిగింది.
ఇవి కూడా చదవండి..
పీఎంపై వ్యాఖ్యల వివాదం.. ఖర్గేకు ఈసీ నోటీసు
సీఎం సిద్ధరామయ్యపై చేతబడి జరిగిందేమో.. మంత్రి సంచలన వ్యాఖ్యలు