జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఎల్‌ఈటీ కమాండర్ హతం
ABN , Publish Date - Nov 16 , 2026 | 03:40 PM
జమ్మూకశ్మీర్‌లో తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎల్ఈటీ కమాండర్ లతీఫ్ భట్ హతమయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లో తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎల్ఈటీ కమాండర్ లతీఫ్ భట్ హతమయ్యాడు. జిల్లాలోని లారూ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం అందడంతో భద్రతా దళాలు భారీ ఆపరేషన్‌కు తెరతీశాయి. ఆ ప్రాంతం మొత్తాన్ని జల్లెడపడుతున్న సమయంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన మరో ఉగ్రవాది ఉమర్ అని భద్రతా దళాలు తెలిపాయి. సైన్యం, సీఆర్‌పీఎఫ్‌తో పాటు స్థానిక పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ కూడా ఉగ్రవాద ఏరివేత చర్యల్లో పాలుపంచుకుంది.
నవంబర్ 11న మీర్ బజార్ వద్ద సీఆర్‌పీఎఫ్ పోస్టుపై జరిగిన దాడికి కుట్రపన్నింది భట్ అని భద్రతా దళాలు తెలిపాయి. ఆ దాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. దాడి అనంతరం ఇద్దరు ఉగ్రవాదులు సమీపంలోని అడవిలోకి పారిపోయారు. గాయపడ్డ జవాన్లకు ఎలాంటి ప్రాణాపాయం లేదని సీఆర్‌పీఎఫ్ అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిలో ఇద్దరు ఇప్పటికే కోలుకుని ఢిల్లీకి వెళ్లారని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
స్థానిక సంస్థల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
హైదరాబాద్ భారత్ సమ్మిట్‌లో ‘ఓట్ చోర్.. గద్దీ చోడ్’ నినాదం..