లద్దాఖ్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం
ABN , Publish Date - Aug 20 , 2026 | 08:43 PM
కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. జమ్ముకశ్మీర్ హైకోర్టు బెంచ్‌ను లద్దాఖ్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ నిర్ణయించిందని హోం మంత్రి అమిత్ షా గురువారం తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. జమ్ముకశ్మీర్ హైకోర్టు బెంచ్‌ను లద్దాఖ్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ నిర్ణయించిందని హోం మంత్రి అమిత్ షా గురువారం తెలిపారు. బెంచ్ ఏర్పాటుతో లద్దాఖ్ ప్రజలకు న్యాయం మరింత చేరువవుతుందని చెప్పారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిక ప్రాంతాలకు ఒకే హైకోర్టు ఉన్న విషయం తెలిసిందే. కేంద్రం 2019లో జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని విభజించి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది
ఇదిలా ఉంటే, కేంద్రం బుధవారం రూ.9,450 కోట్ల విలువైన నాలుగు రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఖరగ్‌పూర్-భద్రక్ మధ్య, భద్రక్-హరిదాస్‌పూర్ మధ్య అదనపు రైల్వే లైన్ ఏర్పాటు చేయడంతో పాటు ఏపీ-తమిళనాడు, కటక్, పారాదీప్ మధ్య అదనపు లైన్‌ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. 2030-31 కల్లా వీటి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ వార్తలనూ చదవండి:
ఫ్రస్ట్రేషన్‌లో అలా అన్నా.. సారీ.. భారత ఆర్మీకి యువతి క్షమాపణ
‘నా యవ్వనం గురించి పగటి కలలు కనకండి’.. రామ్‌దేవ్‌కు కంగనా రనౌత్ స్ట్రాంగ్ కౌంటర్