విషాదానికి ఒకరోజు ముందు యూట్యూబ్‌లో బంధాలపై సంగీత వీడియో..
ABN , Publish Date - Aug 23 , 2026 | 02:59 PM
ఐఫోన్ ఈఎమ్ఐ వివాదం కారణంగా మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పోలీసుల దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇంటర్‌నెట్ డెస్క్: ఐఫోన్ ఈఎమ్ఐ వివాదం కారణంగా మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పోలీసుల దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కునాల్ తల్లి సంగీత, తండ్రి మురళీధర్ ఆరు సంవత్సరాల క్రితం మనస్పర్థల కారణంగా విడిపోయారు. అప్పటినుంచి వేరుగా జీవిస్తున్నారు. విషాదం చోటుచేసుకోవడానికి ఒక రోజు ముందు కునాల్ తల్లి సంగీత బంధాలపై తన యూట్యూబ్ ఛానల్‌లో వీడియో పెట్టింది.
గురువారం పోస్ట్ చేసిన ఆ వీడియోలో సంగీత ఏమందంటే.. ‘మీ ప్రేమకు విలువ ఇవ్వని వ్యక్తికోసం ఏదైనా చేస్తామనటంలో అర్థం లేదు. మీ ప్రేమను, మిమ్మల్ని గౌరవించే వ్యక్తి కోసం మీ జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధంగా ఉండండి. మీ ప్రేమను, మిమ్మల్ని, మీ త్యాగాలను గుర్తించని వ్యక్తి కోసం ఏమి చేసినా వృధానే. చపాతీని రెండు వైపులా కాల్చినపుడే తినడానికి రుచిగా ఉంటుంది. అలాగే, బంధం కూడా రెండు వైపుల నుంచి ఉండాలి. ఇద్దరూ బంధానికి విలువ ఇస్తే.. ఆ బంధంలో ఉండండి. ఒకరు విలువ ఇచ్చి.. మరొకరు విలువ ఇవ్వకపోతే.. అలాంటి బంధంలో కొనసాగటం వృధా. అలాంటి బంధంనుంచి దూరంగా రావటం ఉత్తమం’ అని రాసుకొచ్చింది.
ఇవి కూడా చదవండి
రాహుల్ గాంధీకి దమ్ముంటే తెలంగాణలో ఛత్రోంకి గూంజ్ పెట్టాలి: రాంచందర్‌రావు
దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ.. ఎంత కొట్టాడంటే?