Share News

‘కుంభమేళా’ మోనాలిసా ఓ మైనర్‌!

ABN , Publish Date - Apr 11 , 2026 | 06:34 AM

మహాకుంభ్‌’ ఫేమ్‌ మోనాలిసా పెళ్లి వ్యవహారంలో తాజాగా ఓ పెద్ద ట్విస్ట్‌ చోటుచేసుకుంది. గత నెల ఓ ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్న ఆమె.. మైనర్‌ అని, వయసు 16 ఏళ్లేనని దర్యాప్తులో గుర్తించారు...

‘కుంభమేళా’ మోనాలిసా ఓ మైనర్‌!

  • ఆస్పత్రి రికార్డుల ప్రకారం ఆమె వయసు

16 ఏళ్లే అని నిర్ధారించిన జాతీయ ఎస్టీ కమిషన్‌

  • భర్త ఫర్మాన్‌పై పోక్సో కేసు నమోదు

ఖర్‌గోన్‌, ఏప్రిల్‌ 10: ‘మహాకుంభ్‌’ ఫేమ్‌ మోనాలిసా పెళ్లి వ్యవహారంలో తాజాగా ఓ పెద్ద ట్విస్ట్‌ చోటుచేసుకుంది. గత నెల ఓ ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్న ఆమె.. మైనర్‌ అని, వయసు 16 ఏళ్లేనని దర్యాప్తులో గుర్తించారు. దీంతో ఆమె భర్త ఫర్మాన్‌పై మధ్యప్రదేశ్‌లోని ఖర్‌గోన్‌ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అదేవిధంగా బీఎన్‌ఎస్‌ చట్టం కింద నేరపూరిత కుట్ర, చట్టవిరుద్ధమైన వివాహ సంబంధిత సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కూడా అభియోగాలు మోపారు. ప్రభుత్వాస్పత్రి అధికారిక రికార్డుల ప్రకారం.. మోనాలిసా 2009 డిసెంబరు 30న జన్మించిందని, ఈ ఏడాది మార్చి 11న వివాహం చేసుకునే నాటికి ఆమె వయసు 16 ఏళ్ల 2 నెలల 12 రోజులు అని షెడ్యూల్డ్‌ తెగల(ఎస్టీ) జాతీయ కమిషన్‌ నిర్ధారించింది. గత నెలలో మోనాలిసా అకస్మాత్తుగా ఓ ముస్లిం వ్యక్తిని కేరళలోని నైనార్‌ దేవాలయంలో వివాహం చేసుకోవడం కూడా సంచలనమైంది. ఇది ఒక ‘లవ్‌ జిహాద్‌’ పెళ్లి అని, దీనికి కేరళలోని సీపీఎం నాయకులు, పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులు సహకరించారని ఆరోపిస్తూ ప్రథమ్‌ దూబే అనే ఓ న్యాయవాది ఈ వ్యవహారాన్ని ఎస్టీ జాతీయ కమిషన్‌ ముందుకు తీసుకొచ్చారు. మోనాలిసా, ఫర్మాన్‌ల ఆధార్‌ కార్డుల్లోని వయసు ఆధారంగా వివాహం జరిపించామని ఆలయ యంత్రాంగం దర్యాప్తు అధికారులకు తెలిపారు. ఆ తర్వాత మోసపూరిత బర్త్‌ సర్టిఫికెట్‌తో తమ పెళ్లిని గ్రామ పంచాయతీలో నమోదు చేయించుకున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌ మున్సిపాలిటీ జారీచేసిన ఆ సర్టిఫికెట్‌లో మోనాలిసా పుట్టిన తేదీని 2008 జనవరి 1వ తేదీగా పేర్కొనగా.. అది ప్రభుత్వాస్పత్రి రికార్డుల కంటే రెండేళ్ల ముందు ఉంది. దీంతో ఆ తప్పుడు బర్త్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కమిషన్‌ స్థానిక యంత్రాంగాన్ని ఆదేశించింది.

ఈ వార్తలు కూడా చదవండి

మహిళల జోలికొస్తే అదే చివరి రోజు: మంత్రి సవిత..

బొత్స భావోద్వేగం.. వైఎస్ షర్మిల రియాక్షన్

Updated Date - Apr 11 , 2026 | 08:00 AM