Share News

కేపీఎస్‌సీ మాజీ చైర్మన్‌ అరెస్టు

ABN , Publish Date - Oct 08 , 2026 | 01:47 AM

వెటర్నరీ అధికారుల నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాల కేసులో కర్ణాటక పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మాజీ చైర్మన్‌ శివశంకరప్ప ఎస్‌ సాహుకార్‌ను ఈడీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు.

కేపీఎస్‌సీ మాజీ చైర్మన్‌ అరెస్టు
shivashankarappa

బెంగళూరు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): వెటర్నరీ అధికారుల నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాల కేసులో కర్ణాటక పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మాజీ చైర్మన్‌ శివశంకరప్ప ఎస్‌ సాహుకార్‌ను ఈడీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. బెంగళూరు డాలర్స్‌ కాలనీలోని ఆయన నివాసంపై మంగళవారం ఉదయం ఈడీ అధికారులు దాడి చేశారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకుని, ఆయనను అరెస్టు చేసినట్టు ప్రకటించారు. అదే ప్రాంతంలో ఉన్న కేపీఎస్ సీ సభ్యురాలు గీతా నివాసంలోనూ తనిఖీలు నిర్వహించి, ఆమెను అరెస్టు చేశారు. ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించడంతో పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలుకు తరలించారు.

ఈ వార్తలు కూడా చదవండి

శివరాజ్‌కుమార్‌కు తప్పిన ప్రమాదం.. ముఖానికి అతి సమీపాన పేలిన టపాసులు

ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం..

Updated Date - Oct 08 , 2026 | 02:00 AM