Share News

కాంగ్రెస్‌‌ది 420 ప్రభుత్వం

ABN , Publish Date - Sep 03 , 2026 | 05:36 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదని, అన్ని వర్గాలను మోసగించిందని...

కాంగ్రెస్‌‌ది 420 ప్రభుత్వం

  • వెయ్యి రోజుల్లో ప్రజలకు చేసిందంతా మోసమే

  • కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదని, అన్ని వర్గాలను మోసగించిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రతి విషయంలోనూ సమాజాన్ని మోసం చేసిన ’420 ప్రభుత్వం‘గా మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతులు, విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు.. ఇలా ప్రతి ఒక్కరినీ మోసం చేసిందని ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి తెచ్చారని దుయ్యబట్టారు. బీసీలకు ఏటా రూ.20 వేల కోట్లు ఇస్తామన్న హామీని నీరుగార్చారని, కుల గణన పేరుతో ముస్లింలను బీసీల్లో చేర్చి అసలైన బీసీలకు అన్యాయం చేశారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులను కూడా ప్రభుత్వం దగా చేసిందన్నారు. రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్‌ సర్కారువెయ్యి రోజుల పాలనలో నెరవేర్చిన, పెండింగ్‌లో ఉన్న హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి:

కేరళ సీఎంతో రొనాల్డ్ సోదరి భేటీ.. వీడియో వైరల్

సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు.. నలుగురి బెయిల్ పిటిషన్ల డిస్మిస్

Updated Date - Sep 03 , 2026 | 05:36 AM