Share News

రేవంత్‌రెడ్డి విభజన రాజకీయాలు మానుకోవాలి

ABN , Publish Date - Jun 08 , 2026 | 05:31 AM

ఉత్తరాది-దక్షిణాది అంటూ తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి విభజన రాజకీయాలు చేస్తున్నారని కేంద్రమంత్రి కిరెన్‌ రిజిజు ఆరోపించారు. అలా దేశాన్ని ప్రాంతాల వారీగా విభజించి...

రేవంత్‌రెడ్డి విభజన రాజకీయాలు మానుకోవాలి

  • ఉత్తరాది వారే ఉన్నత పదవుల్లో ఉన్నారనడం సరికాదు: రిజిజు

న్యూఢిల్లీ, జూన్‌ 7: ఉత్తరాది-దక్షిణాది అంటూ తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి విభజన రాజకీయాలు చేస్తున్నారని కేంద్రమంత్రి కిరెన్‌ రిజిజు ఆరోపించారు. అలా దేశాన్ని ప్రాంతాల వారీగా విభజించి మాట్లాడవద్దన్నారు. ఎవరు ఏ ప్రాంతానికి చెందినవారైనా అందరం భారతీయులమేనని స్పష్టం చేశారు. శనివారం రేవంత్‌ రెడ్డి ద హిందూ వార్తా సంస్థ నిర్వహించిన సదస్సులో చేసిన వ్యాఖ్యలపై రిజిజు ఈ మేరకు స్పందించారు. ‘‘రేవంత్‌ చేసిన విభజన ప్రకారం చూసినా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తూర్పు భారతానికి, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ దక్షిణ భారతానికి, ప్రధాని మోదీ పశ్చిమ భారతానికి చెందినవారు. ఉత్తరాది వాళ్లే అత్యున్నత పదవుల్లో ఉన్నారనడం సరైంది కాదు. వాస్తవాలను ఆయన తెలుసుకోవాలి’’ అని సూచించారు. హిందూ వార్తా సంస్థ సదస్సులో రేవంత్‌ మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల పట్ల బీజేపీ రాజకీయపరంగా, ఆర్థికపరంగా వివక్ష చూపుతోందన్నారు. ‘‘రాష్ట్రపతి ఉత్తరాదికి చెందినవారే. ప్రధాని ఉత్తరాది వ్యక్తే’’ అని అన్నారు. దేశ అత్యున్నత పదవుల్లో ఉత్తరాది రాష్ట్రాల వారే ఉన్నారని విమర్శించారు.

ఈ వార్తలు కూడా చదవండి...

ఫాంహౌస్‌ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌‌రెడ్డి

ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్

Read Latest Telangana News, AP News And National News

Updated Date - Jun 08 , 2026 | 05:31 AM