గుజరాతీలపై చేసిన వ్యాఖ్యలపై ఖర్గే విచారం
ABN , Publish Date - Apr 09 , 2026 | 06:35 AM
గుజరాత్ ప్రజల పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, వారిని నిరక్షరాస్యులంటూ చేసిన వ్యాఖ్యలపై...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: గుజరాత్ ప్రజల పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, వారిని నిరక్షరాస్యులంటూ చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నానని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అన్నారు. గుజరాత్ అన్నా.. ఆ రాష్ట్ర ప్రజలన్నా తాను ఎప్పుడూ గౌరవిస్తానని బుధవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘‘కేరళం ఎన్నికల ప్రచారంలో గుజరాతీల పట్ల నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అన్వయించారు. అయినప్పటికీ.. ఆ వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నా.’’ అని తెలిపారు. ఆదివారం కేరళం ఎన్నికల ప్రచారంలో ఖర్గే మాట్లాడుతూ.. ‘‘గుజరాత్ ప్రజలు నిరక్షరాస్యులు. అందుకే ప్రధాని మోదీ వారిని మోసం చేస్తున్నారు. కానీ, కేరళం ప్రజలు విద్యావంతులు.. వీరిని ఎవరూ మోసం చేయలేరు.’’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి..
ట్రంప్ గుడ్ న్యూస్.. దేశీయ సూచీలకు ఫుల్ జోష్..
ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..