కేతన్ ఇంట్లో మరో విషాదం.. కేతన్ మృతిని తట్టుకోలేక..
ABN , Publish Date - Jul 05 , 2026 | 09:58 AM
కేతన్ మృతితో కుదేలైన అతడి కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. కేతన్ తాత దేవీచంద్ అగర్వాల్ చనిపోయారు.
ముంబై, జులై 5: పుణెకు చెందిన ప్రముఖ యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ తనకు కాబోయే భార్య సియా గోయల్ చేతిలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరీలు చేతన్‌ను లోనావాలాలోని లోహగడ్ కోట దగ్గర లోయలోకి తోసి ప్రాణాలు తీశారు. కేతన్ మృతితో కుదేలైన అతడి కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. కేతన్ తాత దేవీచంద్ అగర్వాల్ చనిపోయారు.
71 ఏళ్ల వయసులో శనివారం తుదిశ్వాస విడిచారు. కేతన్ మర్డర్ తర్వాత దేవీచంద్ ఆరోగ్యం బాగా దెబ్బతింది. దీంతో ఆయనను కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. గత కొద్దిరోజుల నుంచి ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం దేవీచంద్ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయితే, కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన ప్రాణాలు కోల్పోయారు.
వరుణ్ కుమార్ రాణా అనే వ్యక్తి ఈ సంఘటనపై తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. ఆ పోస్టులో.. ‘మనవడి మరణాన్ని తట్టుకోలేక కేతన్ అగర్వాల్ తాత దేవీచంద్ అగర్వాల్ చనిపోయారు. దారుణమైన నేరాల కారణంగా ఒక ప్రాణం మాత్రమే కాదు.. కుటుంబం మొత్తం నాశనం అవుతుంది. చట్టప్రకారం తప్పు చేసిన వారికి కఠిన శిక్షలు విధించాలి’ అని రాసుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి
త్వరలోనే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తాం: రైల్వే బోర్డు చైర్మన్
ఈ వృక్షాలు... చరిత్రకు సాక్ష్యాలు