చరిత్ర సృష్టించిన పర్వతారోహకురాలు కవితా చంద్
ABN , Publish Date - Nov 06 , 2026 | 07:57 PM
ఎండ్యూరెన్స్ అథ్లెట్, పర్వతారోహకురాలైన కవితా చంద్ ఇటీవల సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వతం కిలిమంజారోను 24 గంటలలోపే ఎక్కి మళ్లీ కిందకు వచ్చిన తొలి ఇండియన్‌గా రికార్డు సృష్టించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఎండ్యూరెన్స్ అథ్లెట్, పర్వతారోహకురాలైన కవితా చంద్ ఇటీవల సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వతం కిలిమంజారోను 24 గంటలలోపే ఎక్కి మళ్లీ కిందకు వచ్చిన తొలి ఇండియన్‌గా రికార్డు సృష్టించారు. కేవలం 12 గంటల 46 నిమిషాల్లో కిలిమంజారో శిఖరాగ్రాన్ని చేరిన ఆమె దాదాపు అంతేవేగంతో కిందకు వచ్చారు. కేవలం 22 గంటల, 36 నిమిషాల వ్యవధిలో రౌండ్ ట్రిప్ పూర్తి చేసి చరిత్ర సృష్టించారు.
సాధారణంగా ఈ రౌండ్ ట్రిప్‌కు ఐదు నుంచి 9 రోజుల సమయం పడుతుంది. పర్వతంపై ఉండే వాతావరణానికి క్రమంగా అలవాటు పడుతూ మెల్లగా శిఖరాగ్రానికి చేరుకుంటారు. అయితే, కవిత మాత్రం రికార్డు స్థాయిలో 24 గంటల్లోపే పూర్తి చేశారు. కఠిన శిక్షణతో పాటు పలువురి సహకారంతో ఈ ఫీట్ సాధించారు.
పర్వతారోహణకు శిక్షణలో భాగంగా తొలుత ఆమె అక్టోబర్ 11న చికాగో మారథాన్‌లో పాల్గొన్నారు. వారానికి 70 నుంచి 90 కిలోమీటర్ల మేర పరిగెత్తారు. స్ట్రెంగ్త్ ట్రెయినింగ్ కూడా తీసుకున్నారు. అత్యంత వేగవంతంగా మారథాన్ పూర్తి చేసిన మూడో భారతీయురాలిగా గుర్తింపు పొందారు. అనంతరం, నేపాల్‌లోని హిమ్లంగ్ హిమల్ పర్వతారోహణ కూడా చేశారు. శిఖరాగ్రానికి వెళ్లలేకపోయినప్పటికీ అంతటి ఎత్తైన ప్రదేశాల్లో శరీరం అలవాటు పడేందుకు ఆ ఈవెంట్ కవితకు ఉపకరించింది.
కిలిమంజారో పర్వతారోహణ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నట్టు ఆమె చెప్పారు. పర్వతాన్ని వేగంగా ఎక్కిదిగే అవకాశం ఉందని ఎవరో చెబితే తనకు ఆ ఫీట్ చేయాలన్న ఆలోచన వచ్చిందని చెప్పారు. ఈ జర్నీలో తనకు సహకరించినందుకు బూట్స్ అండ్ క్రాంప్స్‌కు చెందిన భరత్, రోమిల్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. వారి సమన్వయంతోనే ఇదంతా సాధ్యమైందని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
ఓటర్ల జాబితాలో పేరు లేదా?.. గుడ్ న్యూస్ చెప్పిన ఎన్నికల సంఘం..
కర్ణాటక బీజేపీ వినూత్న నిరసన.. ఏఐ వీడియోతో కాంగ్రెస్‌పై విమర్శలు!