Share News

చిల్లర లేకుంటే.. బస్సు దిగిపోండి!

ABN , Publish Date - Jul 13 , 2026 | 05:55 AM

బస్సు ప్రయాణాల్లో రోజువారీగా ప్రయాణికులకు ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించేందుకు కర్ణాటక రవాణా మంత్రి భైరతి..

చిల్లర లేకుంటే.. బస్సు దిగిపోండి!

  • కర్ణాటక రవాణా మంత్రి సురేశ్‌నే దింపేసిన కండక్టర్‌

బెంగళూరు, జూలై 12(ఆంధ్రజ్యోతి): బస్సు ప్రయాణాల్లో రోజువారీగా ప్రయాణికులకు ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించేందుకు కర్ణాటక రవాణా మంత్రి భైరతి సురేశ్‌ ఓ సాధారణ ప్రయాణికుడి అవతారం ఎత్తారు. శనివారం రాత్రి బెంగళూరులో వెంట కాన్వాయ్‌, గన్‌మెన్లు, అధికారులు ఎవరూ లేకుండా, మాస్కు ధరించి.. పలు బస్సుల్లో ప్రయాణించి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 10కి పైగా బీఎంటీసీ బస్సుల్లో, వివిధ మార్గాల్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఓ బస్సు ఎక్కిన మంత్రి.. భూపసంద్ర నుంచి హెబ్బాళకు రెండు టికెట్లు ఇవ్వాలని కండక్టర్‌కు రూ.100 నోటు ఇచ్చారు. కండక్టర్‌ రూ.12 చిల్లర ఇవ్వాలని అడిగాడు. చిల్లర లేదని మంత్రి చెప్పగా.. టికెట్‌కు సరిపడా చిల్లర లేకుంటే, బస్సు దిగాలని గట్టిగానే చెప్పాడు. దీంతో మంత్రి బస్సు దిగిపోయారు. సదరు కండక్టర్‌, డ్రైవర్లను సస్పెండ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు.

Also Read:

ఫిరంగి కోసం పోరాటం

వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడి గల్లంతు

Updated Date - Jul 13 , 2026 | 05:55 AM