Share News

కర్ణాటక బడుల్లో హిజాబ్‌, జంధ్యానికి అనుమతి

ABN , Publish Date - May 14 , 2026 | 05:51 AM

పాఠశాలల్లో హిజాబ్‌, జంధ్యం, పేటా ధరించేందుకు విద్యార్థులు అవకాశం కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. 2022లో...

కర్ణాటక బడుల్లో హిజాబ్‌, జంధ్యానికి అనుమతి

బెంగళూరు, మే 13 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో హిజాబ్‌, జంధ్యం, పేటా ధరించేందుకు విద్యార్థులు అవకాశం కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. 2022లో యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం హిజాబ్‌ను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అప్పట్లో ఉడుపి జిల్లాలోని జూనియర్‌ కళాశాలలో విద్యార్థినులు హిజాబ్‌ ధరించి తరగతి గదులకు రావడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మరోవైపు, ఈ ఏడాది ఏప్రిల్‌లో సీఈటీ, మే మొదటివారంలో నీట్‌ పరీక్షల వేళ జంధ్యం తొలగింపు వ్యవహారం కూడా వివాదాస్పదమైంది.

ఈ వార్తలు కూడా చదవండి

ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్

Updated Date - May 14 , 2026 | 05:51 AM