Share News

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

ABN , Publish Date - Jul 09 , 2026 | 12:41 PM

కర్ణాటకలోని ఎల్లాపుర శివారులో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతివేగంగా దూసుకొచ్చిన జీపు అదుపుతప్పి లారీని బలంగా ఢీకొట్టడంతో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది.

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
Karnataka Road Accident

ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలోని ఎల్లాపుర శివారులో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక రాష్ట్రం ఎల్లాపుర సమీపంలోని జాతీయ రహదారిపై అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం సంభవించింది. యువకులు ప్రయాణిస్తున్న జీపు ముందుభాగం లారీ కిందకు దూసుకుపోయి పూర్తిగా నలిగిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలోఇరుక్కుపోయిన వారిని అతికష్టం మీద బయటికి తీశారు. ఈ ప్రమా దంలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.


ఈ ప్రమాదంలో మరణించిన మృతులంతా నిరుపేద కుటుంబాలకు చెందిన యువకులుగా గుర్తించారు. వీరంతా కుటుంబ పోషణకు ఆసరాగా ఉండేందుకు వివిధ ఈ-కామర్స్ సంస్థలలో పార్ట్‌టైమ్ డెలివరీ బాయ్స్‌గా పని చేస్తున్నారు. జీపు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం లేదా దట్టమైన చీకటి కారణంగా ఎదురుగా వస్తున్న లారీని గమనించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వాహనాలు పరిమితికి మించిన వేగంతో ప్రయాణించడం కూడా ప్రమాద తీవ్రతను పెంచిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎల్లాపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


Also Read:

తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?

ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్

Updated Date - Jul 09 , 2026 | 01:23 PM