Share News

తట్టా బుట్టా సర్దుకుని మీ రాష్ట్రానికి వెళ్లండి!

ABN , Publish Date - Apr 05 , 2026 | 07:00 AM

‘లోక్‌ భవన్‌లో అన్ని సౌఖ్యాలు అనుభవిస్తూ..కన్నడిగులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారా..? ఇలా అయితే తట్టాబుట్ట సర్దుకుని మీ రాష్ట్రానికి...

తట్టా బుట్టా సర్దుకుని మీ రాష్ట్రానికి వెళ్లండి!

  • ఎస్‌ఎస్ఎల్‌సీ పరీక్షల్లో హిందీకి గ్రేడింగ్‌ కేటాయింపులో గవర్నర్‌ జోక్యంపై కర్ణాటక రక్షణ వేదిక మండిపాటు

బెంగళూరు, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ‘లోక్‌ భవన్‌లో అన్ని సౌఖ్యాలు అనుభవిస్తూ.. కన్నడిగులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారా..? ఇలా అయితే తట్టాబుట్టా సర్దుకుని మీ రాష్ట్రానికి వెళ్లిపొమ్మని చెప్పాల్సి వస్తుంది’ అని గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ను కర్ణాటక రక్షణ వేదిక(కరవే) హెచ్చరించింది. ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షల్లో థర్డ్‌ లాంగ్వేజ్‌(హిందీ)కు రాష్ట్ర ప్రభుత్వం గ్రేడింగ్‌ కేటాయించిన విషయంలో గవర్నర్‌ జోక్యం చేసుకోవడంపై కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు టీఏ నారాయణగౌడ మండిపడ్డారు. ‘మీరు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి కాదు. ప్రభుత్వ దైనందిన పాలనలో జోక్యం చేసుకునే నైతికత మీకు లేదు’ అని శనివారం విరుచుకుపడ్డారు. హిందీ రాష్ట్రాల తరఫున లాబీ చేస్తున్నారా అని నిలదీశారు. ఉత్తర భారత రాష్ట్రాలలో కన్నడను మూడో భాషగా చేరుస్తూ జీవో జారీ చేయించే సాహసం చూపాలని సవాలు విసిరారు.

ఇవి కూడా చదవండి..

టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై

ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు

Updated Date - Apr 05 , 2026 | 10:09 AM