జిలెటిన్ స్టిక్స్ కట్టుకుని పేల్చుకున్న తండ్రి
ABN , Publish Date - Aug 12 , 2026 | 07:19 AM
దంపతుల మధ్య విభేదాలు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. మరో నలుగురిని ఆస్పత్రిపాలు చేశాయి. కలబురగి జిల్లా ఆళంద తాలూకా మటకి తండాలో శివలాల్ రాథోడ్...
అతనితో పాటు కూతురు కూడా మృతి
భార్య, కుమారుడు, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
కర్ణాటకలోని కలబురగి జిల్లాలో ఘటన
దంపతుల మధ్య విభేదాలే కారణం
బెంగళూరు, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): దంపతుల మధ్య విభేదాలు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. మరో నలుగురిని ఆస్పత్రిపాలు చేశాయి. కలబురగి జిల్లా ఆళంద తాలూకా మటకి తండాలో శివలాల్ రాథోడ్(49) అనే వ్యక్తి ఒంటికి జిలెటిన్ స్టిక్స్ కట్టుకుని మంగళవారం పేల్చుకున్నాడు. ఈ ఘటనలో అతనితోపాటు అతని కూతురు మీరా రాథోడ్(15) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శివలాల్ భార్య సవిత, కుమారుడు ప్రకాశ్, సమీప బంధువు సురేఖ చౌహాన్, ఆమె కుమారుడు వివేక్ చౌహాన్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కలబురగి జిమ్స్ ఆస్పత్రికి తరలించారు. శివలాల్, సవిత దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. దీంతో సవిత తన ఇద్దరు పిల్లలతో కలిసి సమీప బంధువు సురేఖ ఇంట్లో ఉంటున్నారు. శివలాల్ ఒంటరిగా ఉండేవారు. మంగళవారం ఉదయం తన భార్య, పిల్లలు ఉంటున్న సురేఖ ఇంటికి ఆయన వెళ్లారు. లోపలికి ప్రవేశించగానే తలుపులు మూసేసి, జిలెటిన్ స్టిక్స్‌ను పేల్చుకున్నారు. పేలుడు తీవ్రతకు శివలాల్, ఆయన కూతురు మీరా శరీరాలు ఛిద్రమయ్యాయి. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన నలుగురూ తీవ్రంగా గాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
భారతమాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్: పవన్ కల్యాణ్
నా హక్కుల కోసం పోరాడాను.. అదే నేను చేసిన తప్పు: హర్భజన్ సింగ్