వందేమాతరం రెండు చరణాలనే పాడతాము: కర్ణాటక సీఎం
ABN , Publish Date - Aug 26 , 2026 | 03:38 PM
తమ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇకపై వందేమాతర గేయానికి సంబంధించి రెండు చరణాలనే ఆలపిస్తామని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: తమ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇకపై వందేమాతర గేయానికి సంబంధించి రెండు చరణాలనే ఆలపిస్తామని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఈ విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అన్నారు. ఇటీవల రాష్ట్రంలో స్వాతంత్ర్య వేడుకల్లో ఆరు చరణాల జాతీయ గేయం పాడటంపై కూడా సీఎం డీకే శివకుమార్ స్పందించారు. తనకు తెలియకుండానే ఇది జరిగిపోయిందని అన్నారు. ఇకపై మాత్రం రెండు చరణాల జాతీయ గేయం ఉంటుందని స్పష్టం చేశారు.
వందేమాతరం గేయానికి సంబంధించి రెండు చరణాలే పడాలన్న 1937 నాటి తీర్మానికి కట్టుబడి ఉండాలని గత వారం జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ నిర్ణయించింది. జాతీయ గేయానికి సంబంధించి ఆరు చరణాలు పాడాలనే నిబంధనకు కేంద్రం చట్టరూపం ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది.
‘ఈ దేశంలో భిన్న రకాలు వర్గాలు ఉన్నాయి. కాబట్టి అందరితో కలిసి ముందుకు నడవాలని మేము విశ్వసిస్తాము. మా సిద్ధాంతం అదే’ అని ముఖ్యమంత్రి అన్నారు. అందరినీ గౌరవించాలని చెప్పారు. సూర్యచంద్రులు, గాలి, నీటికి ఏ మతమూ లేదని వ్యాఖ్యినంచారు. హిందూ వర్సెస్ హిందుత్వవాదంపై జరుగుతున్న చర్చ విషయంలో సీఎం శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫైర్ ఇంజిన్‌తో ఎమ్మెల్యే కారును కడిగిన సిబ్బంది.. వీడియో వైరల్
బ్రో.. కాస్త ఆగు: రాహుల్‌కు కంగనా రనౌత్ కౌంటర్