కర్ణాటకలో కోటి ఓట్లు గల్లంతు!
ABN , Publish Date - Oct 28 , 2026 | 06:03 AM
కర్ణాటకలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ పూర్తవడంతో తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది
బెంగళూరు, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ పూర్తవడంతో తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. గత ఎన్నికలతో పోలిస్తే 99.32 లక్షల మందికి పైగా ఓటర్లు తగ్గిపోయారు. వీరిలో మృతి చెందినవారు, శాశ్వతంగా చిరునామా మారినవారు, ఒకటికంటే ఎక్కువచోట్ల ఓటరు గుర్తింపు కలిగినవారు ఉన్నారు. ఈ వివరాలను కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అన్బుకుమార్ మంగళవారం వెల్లడించారు. ‘సర్’కు ముందు రాష్ట్రంలో మొత్తం 5,54,32,314 మంది ఓటర్లు ఉండగా, ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత 4,55,00,011 మంది ఉన్నారు. వీరిలో మహిళలు 2,29,12,355 మంది, పురుషులు 2,25,40,493 మంది, ఇతరులు 2,841 మంది ఉన్నారు. వీరితో పాటు సర్వీసు ఓటర్లు 44,322 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఓటరు జాబితాలో 85 ఏళ్లు పైబడినవారు 3,92,134 మంది, 18-19 ఏళ్లు మధ్యవారు 6,83,364 మంది ఉన్నారు. డ్రాఫ్ట్‌రోల్‌లో 1.07 కోట్ల మంది ఓటర్లకు సంబంధించిన అభ్యంతరాలు రాగా 8.64 లక్షల మంది క్లెయిమ్ చేసుకున్నారు. కర్ణాటకలో జూన్ 30న సర్ ప్రక్రియ ప్రారంభమైంది.