కర్ణాటకలో ‘క్యాబినెట్’ ప్రకంపనలు తీవ్రం
ABN , Publish Date - Aug 05 , 2026 | 06:02 AM
కర్ణాటక కాంగ్రె్‌సలో క్యాబినెట్ విస్తరణ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. మంత్రి పదవులు దక్కని ఎమ్మెల్యేల నిరసనలు తీవ్రతరమ్యాయి. మంగళవారం బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయం ఎదుట...
రాజీనామా చేస్తామన్న 15 మంది
ఎమ్మెల్యేలు.. సీఎం డీకే సీరియస్
రాజీనామా చేస్తే 2 నిమిషాల్లో
ఆమోదిస్తామని స్పష్టీకరణ
బెంగళూరు, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక కాంగ్రె్‌సలో క్యాబినెట్ విస్తరణ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. మంత్రి పదవులు దక్కని ఎమ్మెల్యేల నిరసనలు తీవ్రతరమ్యాయి. మంగళవారం బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యేలు కృష్ణప్ప, ఆయన కుమారుడు ప్రియకృష్ణ, మాజీ మంత్రి దినేశ్ గుండూరావు అనుచరులు, క్యాబినెట్‌లో మహిళలకు అవకాశం లేకపోవడంపై పలు ప్రాంతాల మహిళలు నిరసనకు దిగారు. సోమవారం విస్తరణ తర్వాత విజయపుర జిల్లా ఇండి ఎమ్మెల్యే యశ్వంతరాయగౌడ పాటిల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన బాటలోనే సుమారు 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని బెదిరిస్తున్నారు. వారి తీరుపై సీఎం డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజీనామా చేస్తే రెండే రెండు నిమిషాల్లో ఆమోదించేస్తామని హెచ్చరించారు. బ్లాక్‌మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. మంత్రివర్గంలోకి 33 మందిని మాత్రమే నియమించాల్సి ఉంటుందని గుర్తుచేశారు. ‘గతంలో ధరంసింగ్, సిద్దరామయ్యల మంత్రివర్గాల్లోకి నన్ను కూడా తీసుకోలేదు. నేనూ, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి జి.పరమేశ్వర సహనంతో ఉండలేదా? సహనంతో మెలగాలి. పార్టీ ముఖ్యం’ అని సీఎం పేర్కొన్నారు. మరోవైపు.. సిద్ధరామయ్య హయాంలో నియమితులైన బోర్డులు, కార్పొరేషన్ల చైర్మన్ల పదవీకాలం రెండున్నరేళ్లు ముగిసిందని.. వెంటనే రాజీనామా చేయాలని సీఎం డీకే వారిని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్‌కున్న గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరు: బెంజమిన్ నెతన్యాహు
ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట.. విచారణ అనంతరం విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం..