Share News

కన్నడ మాట్లాడితే ఉద్యోగాలివ్వరా?!

ABN , Publish Date - Oct 26 , 2026 | 05:17 AM

కర్ణాటక మాతృభాష కన్నడ మాట్లాడేవారికి ఉద్యోగాలు ఇచ్చేది లేదని ఐటీ కంపెనీలు చెబుతున్నాయంటూ వైరల్‌ అవుతున్న ఓ వీడియో తీవ్ర దుమారానికి దారి తీసింది

కన్నడ మాట్లాడితే ఉద్యోగాలివ్వరా?!
cm dk shivakumar

  • అలా అయితే కఠినంగా వ్యవహరిస్తాం

  • ఐటీ కంపెనీలకు కర్ణాటక సీఎం డీకే హెచ్చరిక

  • కన్నడ మాట్లాడితే ఉద్యోగాలు ఇవ్వరా?!

    బెంగళూరు, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): కర్ణాటక మాతృభాష కన్నడ మాట్లాడేవారికి ఉద్యోగాలు ఇచ్చేది లేదని ఐటీ కంపెనీలు చెబుతున్నాయంటూ వైరల్‌ అవుతున్న ఓ వీడియో తీవ్ర దుమారానికి దారి తీసింది. దీనిపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఏ ప్రైవేటు కంపెనీ అయినా.. కన్నడ మాట్లాడుతున్నారన్న కారణంగా స్థానిక యువతను నిర్లక్ష్యం చేసినా.. ఉద్యోగాలు ఇవ్వకపోయినా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది.’’ అని హెచ్చరించారు. అంతేకాదు, ‘‘కన్నడ భాష కర్ణాటక సార్వభౌమత్వానికి ప్రతీక.’’ అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ చేశారు. బెంగళూరులోని ఐటీ కంపెనీల్లో ఉద్యోగావకాశాల్లో కన్నడిగులకు అన్యాయం వాటిల్లుతోందనే అంశం శోచనీయమన్నారు. తాజాగా ఓ యువతి సోషల్‌ మీడియాలో పెట్టిన వీడియో స్థానికంగా చర్చకు దారితీసింది. బెంగళూరులో ఐటీ కంపెనీలు తమిళ, తెలుగు వారికి ప్రాధాన్యత ఇస్తున్నాయని, రెజ్యూమ్‌లో కన్నడ మాతృభాషగా ఉంటే ఉద్యోగాలు లభించడం లేదని, పైగా బెంగళూరులోని కళాశాలల్లో క్యాంపస్‌ ఇంటర్వ్యూలు చేయడం లేదని యువతి పేర్కొన్నారు.

Updated Date - Oct 26 , 2026 | 05:19 AM