Share News

కర్ణాటక మంత్రుల్లో ఏడుగురు బిలియనీర్లు

ABN , Publish Date - Aug 09 , 2026 | 05:59 AM

కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గంలో 27 మందిపై క్రిమినల్‌ కేసులున్నాయని అసోషియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) వెల్లడించింది....

కర్ణాటక మంత్రుల్లో ఏడుగురు బిలియనీర్లు

న్యూఢిల్లీ, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గంలో 27 మందిపై క్రిమినల్‌ కేసులున్నాయని అసోషియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) వెల్లడించింది. వీరిలో ఏడుగురిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులున్నాయని తెలిపింది. ఇటీవల మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో సీఎం డీకే శివకుమార్‌ సహా మొత్తం 33 మందిలో 32 మంది సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించిన ఏడీఆర్‌ ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. మంత్రివర్గంలో ఏడుగురు బిలియనీర్లు ఉన్నారు. మంత్రుల మొత్తం ఆస్తులు రూ.3,550 కోట్లు కాగా, సగటు ఆస్తులు రూ.110.94 కోట్లుగా ఏడీఆర్‌ పేర్కొంది. సీఎం డీకే శివకుమార్‌కు మంత్రులందరిలోనూ అత్యధికంగా రూ.1413.80 కోట్ల ఆస్తులు, రూ.265 కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపింది. మంత్రులందరూ కోటీశ్వరులేనని వెల్లడించింది.

ఈ వార్తలు కూడా చదవండి

ఆగ్రాలో రహదారిపై భారీ గుంత.. అందరూ చూస్తుండగానే..

డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి: మోదీ

Updated Date - Aug 09 , 2026 | 05:59 AM