Share News

మంటల్లో పెట్రోల్‌ పోయొద్దు!

ABN , Publish Date - Aug 03 , 2026 | 06:13 AM

బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌, బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌ మధ్య మరోసారి చిచ్చురేగింది. తనను ఇబ్బందిపెట్టవద్దని, మంటల్లో పెట్రోల్‌ పోయవద్దని హృతిక్‌ రోషన్‌ను కంగన...

మంటల్లో పెట్రోల్‌ పోయొద్దు!

  • హృతిక్‌ రోషన్‌కు కంగన హెచ్చరిక

న్యూఢిల్లీ, ఆగస్టు 2: బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌, బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌ మధ్య మరోసారి చిచ్చురేగింది. తనను ఇబ్బందిపెట్టవద్దని, మంటల్లో పెట్రోల్‌ పోయవద్దని హృతిక్‌ రోషన్‌ను కంగన హెచ్చరించే వరకు వెళ్లింది. జంతర్‌మంతర్‌ వద్ద సీజేపీ నేతృత్వంలో జెన్‌ జీ యువత చేసిన ఆందోళనలను కంగన తప్పుపడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సీజేపీ ప్రతినిధి సౌరవ్‌దాస్‌ ఆ వ్యాఖ్యలను తప్పుబట్టారు. దీనితో సౌరవ్‌దా్‌సను ఉద్దేశిస్తూ కంగన విమర్శలు చేశారు. సౌరవ్‌దాస్‌ మళ్లీ స్పందిస్తూ.. తాను హృతిక్‌రోషన్‌లా ఉంటానని స్నేహితులు అంటుంటారని, అందుకే కంగన తనపై విమర్శలు చేస్తున్నారేమోనని హృతిక్‌, కంగన మధ్య ఉన్న పాత వివాదాన్ని ప్రస్తావిస్తూ వ్యంగ్య వాఖ్యలు చేశారు.ఈ క్రమంలో కంగనకు వ్యతిరేకంగా ‘హృతిక్‌ రోషన్‌కు క్షమాపణలు చెప్పాల్సి ఉంది’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఎక్స్‌లో ట్రెండింగ్‌ మొదలైంది. ఈ హ్యాష్‌ట్యాగ్‌తో రచయిత ఫ్రెడ్డీ బర్డీ పెట్టిన పోస్టుపై హృతిక్‌ స్పందించారు. ‘‘ఇప్పుడు ఒకరు నచ్చలేదని మరొకరివైపు నిలబడటం సమాజంలో సమస్యగా మారింది’’ అని పోస్టుపెట్టారు. దీనిపై కంగన మండిపడుతూ పోస్టు పెట్టారు. ‘‘డియర్‌ హృతిక్‌. నీ పేరును ఉపయోగించుకుంటూ నన్ను ఇబ్బందిపెడుతున్న వారి తీరును మీరు ఖండించాలిగానీ, వారికి ఊతమిచ్చేలా వ్యవహరించకూడదు’’ అని కంగన పేర్కొన్నారు. కంగన 2016లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హృతిక్‌ రోషన్‌, తాను కొంతకాలం ప్రేమ బంధంలో ఉన్నామని వ్యాఖ్యానించారు. దాన్ని హృతిక్‌రోషన్‌ ఖండించారు. కంగనతో తానెప్పుడూ, ఎలాంటి బంధంలో లేనని ప్రకటించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..

వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..

Updated Date - Aug 03 , 2026 | 06:13 AM