నాకు శీల పాఠాలు చెప్పొద్దు
ABN , Publish Date - Aug 21 , 2026 | 06:50 AM
రాందేవ్ బాబా తన యవ్వన జీవితం గురించి, బెడ్రూం వ్యవహారాల గురించి పగటి కలలు కనొద్దని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ అన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ నేతలను గట్టర్...
మీ శీలం కన్నా నా శీలం మెరుగు
రాందేవ్‌పై విరుచుకుపడ్డ కంగనా రనౌత్
న్యూఢిల్లీ, ఆగస్టు 20: రాందేవ్ బాబా తన యవ్వన జీవితం గురించి, బెడ్రూం వ్యవహారాల గురించి పగటి కలలు కనొద్దని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ అన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ నేతలను గట్టర్ జనరేషన్‌గా అభివర్ణిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఇటీవల రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలకు ఇన్‌స్టాగ్రామ్‌లో బదులిస్తూ ఆమె తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. తానెప్పుడూ తప్పుడు ఔషధ ప్రకటనలు చేసినందుకు సుప్రీంకోర్టు నుంచి మందలింపు ఎదుర్కొనలేదని చెప్పారు. ‘‘నాకు శీల పాఠాలు చెప్పొద్దు, మీ శీలం కన్నా నా శీలం మెరుగు’’ అన్నారు. ఇటీవల రాందేవ్ బాబా ఒక టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చినపుడు ఏ దేశపు యువతనైనా గట్టర్ అనడం చెడిపోయిన మెదడుకు సంకేతమన్నారు. ఈ విషయాన్ని ఆమె పార్టీ వాళ్లు కూడా గమనించాలని సూచించారు. ఈ వ్యాఖ్యలపై కంగన త్రీవంగా స్పందించారు.
ఇవి కూడా చదవండి:
పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్
బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు