Share News

అన్నామలై రాజీనామాను ఆమోదించిన నితిన్‌ నబిన్‌

ABN , Publish Date - Jun 05 , 2026 | 11:26 AM

బీజేపీ పార్టీ అన్నామలై రాజీనామాను ఆమోదిస్తుందా? లేదా అన్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ శుక్రవారం అన్నామలై రాజీనామాను అంగీకరించారు.

అన్నామలై రాజీనామాను ఆమోదించిన నితిన్‌ నబిన్‌
K Annamalai

న్యూఢిల్లీ, జూన్ 5: తమిళనాడు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌, ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌‌లతో అన్నామలై భేటీ అయ్యారు. ఐదు పేజీల రాజీనామా లేఖను వారికి అందించారు. అదే రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కూడా అన్నామలై కలిశారు. బీజేపీ నుంచి తాను వైదొగలటానికి గల కారణాలను ఆయనకు వివరించారు. పార్టీ అన్నామలై రాజీనామాను ఆమోదిస్తుందా? లేదా అన్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ శుక్రవారం అన్నామలై రాజీనామాను అంగీకరించారు.


కొత్త పార్టీ దిశగా అడుగులు..

2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా కాకుండా అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవటం అన్నామలైకి ఏమాత్రం ఇష్టం లేదని ఆయన అనుచరులు మీడియాతో తెలిపారు. తమిళనాట బీజేపీ ఒంటరిగా పోటీ చేయడమే మంచిదని పార్టీ పెద్దలతో అన్నామలై పదే పదే చెప్పారట. అధ్యక్షుడి పదవి నుంచి తొలగించటం.. తన మాట వినకుండా అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవటం అన్నామలై అవమానంగా భావించారట. ఈ కారణాలతోనే పార్టీ వీడినట్లు అనుచరులు చెప్పారు. బీజేపీని వీడిన అన్నామలై కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రచారం బాగా జరుగుతోంది. ప్రస్తుతం ఆయన ‘వియ్ లీడర్స్’ ట్రస్ట్‌ను నిర్వహిస్తున్నారు. దాన్ని విస్తరించి రాజకీయ ఉద్యమంగా మార్చే ఆలోచనలో ఉన్నారట.


ఇవి కూడా చదవండి

రామలింగా రెడ్డి రాజీనామా.. స్పందించిన సీఎం డీకే శివకుమార్

కవరు తొడిగిన మామిడికి గిట్టుబాటు ధర

Updated Date - Jun 05 , 2026 | 11:59 AM