Share News

రామలింగా రెడ్డి రాజీనామా.. స్పందించిన సీఎం డీకే శివకుమార్

ABN , Publish Date - Jun 05 , 2026 | 11:41 AM

మంత్రి రామలింగా రెడ్డి రాజీనామాపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ స్పందించారు. తాము మంచి స్నేహితులమని, ఈ సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పారు.

రామలింగా రెడ్డి రాజీనామా.. స్పందించిన సీఎం డీకే శివకుమార్
CM DK Shivakumar on Ramalinga Reddy's Resignation

ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టి వారం కూడా కాకముందే సీనియర్ మంత్రి రామలింగా రెడ్డి రాజీనామా చేయడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. రామలింగా రెడ్డి రాజీనామాపై సీఎం తొలిసారిగా స్పందించారు. తాము ఈ సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పారు. ‘ఆయన నాకు మంచి ఫ్రెండ్. మేము ఈ సమస్యను పరిష్కరించుకుంటాము’ అని విలేకరులతో సీఎం అన్నారు.

తనకు బెంగళూరు డెవలప్‌మెంట్ శాఖ దక్కకపోవడంతో రామలింగా రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ శాఖే కేటాయిస్తానని తనకు సీఎం డీకే రెండు సార్లు చెప్పారని అన్నారు. విలేకరుల ముందే ఆయన రాజీనామా లేఖపై సంతకం చేశారు. లేఖను తాను స్వయంగా ఇవ్వనని కూడా చెప్పారు. మరో వ్యక్తితో రాజీనామా లేఖను పంపిస్తానని అన్నారు. అయితే, సీఎంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని కూడా స్పష్టం చేశారు.


సిద్ధరామయ్య‌ ప్రభుత్వంలో బెంగళూరు డెవలప్‌మెంట్ శాఖ బాధ్యతలను డీకే శివకుమార్ నిర్వహించేవారు. సీఎం అయ్యాక ఈ శాఖను ఆయన వదులుకున్నారు. మరో కీలక నేత కృష్ణ బైరె గౌడకు బెంగళూరు డెవలప్‌మెంట్ శాఖను కేటాయించారు. ఈ పరిణామం సీనియర్ నేత రామలింగా రెడ్డికి తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ఎప్పటి నుంచో ఈ శాఖను కోరుకుంటున్న ఆయన చివరకు శుక్రవారం మంత్రి పదవికి రాజీనామా చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

అన్నామలై రాజీనామాను ఆమోదించిన నితిన్‌ నబిన్‌

కర్ణాటకలో కలకలం.. విలేకరుల ముందే మంత్రి రాజీనామా

Updated Date - Jun 05 , 2026 | 12:04 PM