Share News

ప్రశ్నలను ఎదుర్కొనేందుకు.. వ్యవస్థలు సిద్ధంగా ఉండాలి

ABN , Publish Date - Aug 12 , 2026 | 05:42 AM

పౌరుల నుంచి ప్రశ్నలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థలు సిద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ సూచించారు. పౌరుల హక్కులపై అవగాహన...

ప్రశ్నలను ఎదుర్కొనేందుకు..  వ్యవస్థలు సిద్ధంగా ఉండాలి

  • ప్రజలు తమను గౌరవించాలని భావిస్తే..

  • అంతేస్థాయిలో జవాబుదారీగా ఉండాలి

  • ప్రశ్నలను ఎదుర్కోవడం బలహీనత కాదు

  • అది వ్యవస్థల బలానికి నిదర్శనం

  • పౌరులకు హక్కులపై అవగాహన పెరిగింది

  • సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ, ఆగస్టు 11: పౌరుల నుంచి ప్రశ్నలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థలు సిద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ సూచించారు. పౌరుల హక్కులపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థలపై అంచనాలు పెరుగుతున్నాయని.. ప్రజలు అప్పగించిన అధికారానికి ఆయా వ్యవస్థలు, సంస్థలు జవాబుదారీగా ఉండాలని స్పష్టం చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డ్‌ అసోసియేషన్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘మనం మునుపెన్నడూ లేని కాలంలో ఉన్నాం. ఇప్పుడు ప్రజలకు తమ హక్కులపై, తమను పాలించే వ్యవస్థలపై గతంలో కంటే ఎక్కువ అవగాహన ఉంది. ఈ మార్పు ఎప్పటికైనా రావాల్సిందే. అయితే ఈ పెరుగుతున్న అవగాహన అంచనాలను, బాధ్యతలను పెంచుతుంది. ఇది సరైనదే. ప్రభుత్వ వ్యవస్థలు తమను ప్రజలు గౌరవించాలని భావిస్తే.. ఆ వ్యవస్థలు కూడా తమకు అప్పగించిన అధికారం పట్ల అంతే జవాబుదారీగా, బాధ్యతగా ఉండాల్సిందే. ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థలు ప్రశ్నలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇలా ప్రశ్నలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటం ఆ వ్యవస్థల బలహీనత కాదు.. అది వాటి బలానికి నిదర్శనం’’అని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ స్పష్టం చేశారు. న్యాయం, సమానత్వం, పారదర్శకత అనేవి కేవలం తీర్పుల్లో మాత్రమేకాకుండా.. న్యాయవ్యవస్థను ఆశ్రయించేవారి జీవితానుభవంలో కనిపించాలని చెప్పారు.

ఇవి కూడా చదవండి

భారతమాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్: పవన్ కల్యాణ్

నా హక్కుల కోసం పోరాడాను.. అదే నేను చేసిన తప్పు: హర్భజన్ సింగ్

Updated Date - Aug 12 , 2026 | 05:42 AM