పెండింగ్ కేసులపై న్యాయ సంస్కరణల కమిషన్
ABN , Publish Date - Mar 22 , 2026 | 06:21 AM
కోర్టుల్లో పెరిగిపోతున్న పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడానికి న్యాయ సంస్కరణల కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు...
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న పిలుపు
బెంగళూరు, మార్చి 21(ఆంధ్రజ్యోతి): కోర్టుల్లో పెరిగిపోతున్న పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడానికి న్యాయ సంస్కరణల కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న పిలుపునిచ్చారు. ఈ కమిషన్‌లో సుప్రీంకోర్టు, హైకోర్టులు, జిల్లా న్యాయవ్యవస్థకు చెందిన సభ్యులే కాకుండా బార్ అసోసియేషన్, అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్, బార్‌కు ప్రాతినిధ్యం వహించేవారితో పాటు ప్రభుత్వం తరఫు నుంచి కూడా సభ్యులు ఉండాలని సూచించారు. పెండింగ్ కేసులు తగ్గించడానికి ఒక న్యాయ కమిషన్ ద్వారా సంస్థాగత జోక్యం అవసరమని స్పష్టం చేశారు. వ్యాజ్యాలకు అతిపెద్ద కారణం ప్రభుత్వాలేనని ఆమె నొక్కి చెప్పారు. నిరంతరం దావాలు వేయడం ద్వారా ప్రభుత్వాలు కేసుల సంఖ్యను మరింతగా పెంచుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
అతడి స్థాయిని ఎవరూ భర్తీ చేయలేరు: కె. శ్రీకాంత్
రామ జన్మభూమిని దర్శించిన ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్, కెప్టెన్ పంత్..