బాబ్రీ విచారణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ లిబర్హాన్ మృతి
ABN , Publish Date - Aug 05 , 2026 | 06:12 AM
బాబ్రీ మసీదు కూల్చివేతపై చరిత్రాత్మక దర్యాప్తు జరిపిన ‘లిబర్హాన్ కమిషన్’ ఛైర్మన్.. ఏపీ, మద్రాస్ హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్‌సింగ్ లిబర్హాన్...
న్యూఢిల్లీ,ఆగస్టు4: బాబ్రీ మసీదు కూల్చివేతపై చరిత్రాత్మక దర్యాప్తు జరిపిన ‘లిబర్హాన్ కమిషన్’ ఛైర్మన్.. ఏపీ, మద్రాస్ హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్‌సింగ్ లిబర్హాన్(87) ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చండీగఢ్‌లో తుదిశ్వాస విడిచారు. సోమవారం ఆయన అంత్యక్రియలు ముగిశాయి. 1992 డిసెంబరులో బాబ్రీ కూల్చివేత జరిగిన పది రోజులకే నాటి పీవీ నరసింహారావు ప్రభుత్వం జస్టిస్ లిబర్హాన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా 17 ఏళ్ల పాటు సాగిన ఈ విచారణ అనంతరం 2009లో జస్టిస్ లిబర్హాన్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. బాబ్రీ కూల్చివేత అప్పటికప్పుడు జరిగింది కాదని, అదంతా ముందస్తు వ్యూహం ప్రకారం జరిగిందని ఆ నివేదికలో స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్‌కున్న గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరు: బెంజమిన్ నెతన్యాహు
ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట.. విచారణ అనంతరం విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం..