Share News

నిరసనకారులు ఏం మాట్లాడాలనేది కోర్టులు శాసించలేవు!

ABN , Publish Date - Aug 04 , 2026 | 06:46 AM

ప్రజలు వ్యక్తం చేసే అసమ్మతిని నేరంగా పరిగణించడం అనే ధోరణి కొనసాగితే అది మనదేశంలో ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగించే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌...

నిరసనకారులు ఏం మాట్లాడాలనేది కోర్టులు శాసించలేవు!

ప్రజల అసమ్మతిని నేరంగా పరిగణిస్తే ప్రజాస్వామ్యానికే ముప్పు: జస్టిస్‌ ఓకా

ముంబై, ఆగస్టు 3: ప్రజలు వ్యక్తం చేసే అసమ్మతిని నేరంగా పరిగణించడం అనే ధోరణి కొనసాగితే అది మనదేశంలో ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగించే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా హెచ్చరించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ప్రజలకు రాజ్యాంగం కల్పించిందని, ఎక్కడైతే నిరసనల ద్వారా తమ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ప్రజలకు అనుమతి లభించదో అక్కడ ప్రజాస్వామ్యం లేనట్లేనని ఆయన నొక్కి చెప్పారు. అది ఏ అంశమైనా సరే.. ఎలాంటి నేరానికి పాల్పడకుండా శాంతియుతంగా నిరసన తెలపాలని ప్రజలు అనుకుంటే అందుకు పోలీసులు, కోర్టులు అనుమతించాలని పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు నిరసనకారులు చేసిన ప్రసంగాల ఆధారంగా కోర్టులు తీర్పులు ఇవ్వలేవని స్పష్టం చేశారు. ముంబైలోని కేసీ కాలేజీ ఆడిటోరియంలో ఈనెల 1న నిర్వహించిన ఓ కార్యక్రమంలో జస్టిస్‌ ఓకా ప్రసంగించారు. పిటిషనర్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలు కోర్టుకు నచ్చకపోవచ్చునని, అయితే వారి వాక్‌ స్వాతంత్ర్యాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించడం న్యాయస్థానాల ప్రాథమిక విధి అని పేర్కొన్నారు. పిటిషనర్‌ ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు? అని చెప్పడం కోర్టుల పనికాదు’’ అని ఆయన స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

నీరజ్ చోప్రా సలహాతోనే మెడల్ వరించింది: కాంస్య విజేత యశ్‌వీర్ సింగ్

టీమిండియా మాజీ కోచ్ దిలీప్ భావోద్వేగభరితమైన లేఖ

Updated Date - Aug 04 , 2026 | 06:46 AM