మరో పేపర్ లీక్.. స్టూడెంట్స్‌కు కాక్రోచ్ జనతా పార్టీ మద్దతు
ABN , Publish Date - Aug 03 , 2026 | 01:02 PM
ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ పరీక్షలో పేపర్ లీకైనట్టు ఆరోపణలు రావడంతో అక్కడి విద్యార్థులు గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కాక్రోచ్ జనతా పార్టీ తాజాగా ఝార్ఖండ్ విద్యార్థులకు మద్దతు ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ పరీక్షలో పేపర్ లీకైనట్టు ఆరోపణలు రావడంతో అక్కడి విద్యార్థులు గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కాక్రోచ్ జనతా పార్టీ తాజాగా ఝార్ఖండ్ విద్యార్థులకు మద్దతు ప్రకటించింది. రాజధాని రాంచీలో ప్రస్తుతం విద్యార్థుల నిరసనలు మిన్నంటాయి. పేపర్ లీక్ ఉదంతంపై దర్యాప్తు జరపాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియం వద్ద విద్యార్థులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహాతో ఆదివారం ఆమరణ దీక్ష ప్రారంభించారు. వారాల తరబడి నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని మహాతో ఆరోపించారు. కమిషన్, ప్రభుత్వం తీరుతో విద్యార్థుల మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి తమ డిమాండ్స్‌కు ఆమోదం తెలిపే వరకూ తన దీక్ష కొనసాగుతుందని చెప్పారు. ఇటీవల జరిగిన ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఈ మధ్యకాలంలో టీడీపీఎల్ ద్వారా జరిగిన పరీక్షలను సమీక్షించాలని డిమాండ్ చేశారు.
ఏ ఎగ్జామ్‌లోనైనా పేపర్ లీక్ జరుగుతూనే ఉందని ఒక విద్యార్థులు మండిపడ్డారు. ఈ విషయాలపై సీఎం హేమంత్ సోరెన్ తమతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అవకతవకలపై దర్యాప్తు జరపాలని కోరారు. ఈ నిరసనలపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. తాను ఝార్ఖండ్ విద్యార్థులతో మాట్లాడినట్టు చెప్పారు. విద్యార్థులకు సీజేపీ మద్దతు ప్రకటిస్తోందని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
జంతర్‌మంతర్ నిరసన.. ఆ బాలికపై కేసు ఉండదన్న పోలీసు వర్గాలు
ఎఫ్‌ఐఆర్ ఇంకా వెనక్కు తీసుకోలేదు.. ప్రధాని క్షమించినా.. బాలిక తల్లి ఆవేదన