ఎఫ్‌ఐఆర్ ఇంకా వెనక్కు తీసుకోలేదు.. ప్రధాని క్షమించినా.. బాలిక తల్లి ఆవేదన
ABN , Publish Date - Aug 03 , 2026 | 08:16 AM
జంతర్‌మంతర్ నిరసనల సందర్భంగా ప్రధానిపై అసభ్య పదజాలం వాడి చిక్కుల్లో పడ్డ బాలిక తల్లి మరోసారి స్పందించారు. తన కుమార్తెను ప్రధాని క్షమించినా పోలీసులు ఇంకా ఎఫ్ఐఆర్‌ను వెనక్కు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: జంతర్‌మంతర్ నిరసనల సందర్భంగా ప్రధానిపై అసభ్య పదజాలం వాడి చిక్కుల్లో పడ్డ బాలిక తల్లి మరోసారి స్పందించారు. తన కుమార్తెను ప్రధాని క్షమించినా పోలీసులు ఇంకా ఎఫ్ఐఆర్‌ను వెనక్కు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక చేసిన తప్పునకు పశ్చాత్తాపడుతోందని చెప్పారు. తప్పుదారి పట్టిన చిన్నారులను క్షమించాలని, సక్రమమార్గంలో నడిపించాలని ప్రధాని చెప్పినా పోలీసులు ఇంకా ఎఫ్ఐఆర్ వెనక్కు తీసుకోలేదని అన్నారు. పెద్దల విషయంలో తన కూతురు అసభ్య పదజాలం వాడి ఉండాల్సింది కాదని అన్నారు. తాను యావత్ భారత దేశానికి బాలిక తరఫున క్షమాపణ చెబుతున్నానని అన్నారు. ‘ఆమె చేసిన తప్పునకు తలదించుకుంది. తన తప్పును తెలుసుకుంది. ఒక తల్లిగా నాకు ఇది చాలా ముఖ్యం’ అని అన్నారు. .
నిరసన తెలిపేందుకు, వివిధ వేదికల్లో తమ అభిప్రాయాలను వినిపించేందుకు యువతకు హక్కు ఉన్నప్పటికీ అసభ్య భాష మాత్రం వాడకూడదని బాలిక తల్లి అభిప్రాయపడ్డారు. పుట్టిన రోజుకోసం దుస్తులు కొనుక్కుంటానని జులై 23న తన కుమార్తె బయటకు వెళ్లిందని చెప్పారు. ఆమె వైరల్ వీడియోను బంధువులు పంపించాకే ఈ విషయం తమకు తెలిసిందని చెప్పారు. ‘ఘటన గురించి వెలుగులోకి వచ్చాక మేము ముఖం దాచుకుని బయటకు వెళ్లాల్సి వస్తోంది. గతంలో ఉన్న ప్రాంతం నుంచి మేము మరో చోటకు మారిపోయాము. తరచూ మకాం మార్చాల్సి వస్తోంది. బాలిక మైనర్ అని ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. కానీ ఆమెపై ఎఫ్ఐఆర్ మాత్రం ఇంకా వెనక్కు తీసుకోలేదు’ అని బాలిక తల్లి తెలిపారు. బాలిక కూడా క్షమాపణ చెప్పిన విషయాన్ని పేర్కొన్నారు. ‘ప్రధాని స్వయంగా ఆమెను క్షమించినప్పుడు పోలీసులు కూడా కేసు క్లోజ్ చేసి ఎఫ్ఐఆర్‌ను వెనక్కు తీసుకోవాలి’ అని అభ్యర్థించారు. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు
ఈ వార్తలనూ చదవండి:
ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో మోసం.. రూ. 16 లక్షలు దోచేసిన కేటుగాళ్లు..
కోర్టుల్లో విచారణకు నోచని ‘పరీక్షల్లో అక్రమాల’ కేసులు..158