Share News

జంతర్‌మంతర్ నిరసన.. ఆ బాలికపై కేసు ఉండదన్న పోలీసు వర్గాలు

ABN , Publish Date - Aug 03 , 2026 | 09:08 AM

జంతర్‌మంతర్ నిరసనల సందర్భంగా ప్రధానిని ఉద్దేశించి అసభ్యపదజాలంతో మాట్లాడిన బాలికపై కేసు పెట్టవద్దని ఢిల్లీ పోలీసులు నిర్ణయించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

జంతర్‌మంతర్ నిరసన.. ఆ బాలికపై కేసు ఉండదన్న పోలీసు వర్గాలు
CJP Protests - Delhi Police To Drop Case Against Minor Girl

ఇంటర్నెట్ డెస్క్: జంతర్‌మంతర్ నిరసనల సందర్భంగా ప్రధానిని ఉద్దేశించి అసభ్యపదజాలంతో మాట్లాడిన బాలికపై కేసు పెట్టవద్దని ఢిల్లీ పోలీసులు నిర్ణయించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ ఉదంతానికి సంబంధించి తొలుత నోయిడా పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఢిల్లీ పోలీసులు ఈ ఉదంతంపై దృష్టి సారించారు.

ఈ నేపథ్యంలో బాలిక ప్రధానికి క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేసింది. తనకు 15 ఏళ్లేనని, నిరసన వద్ద ఇతరుల ప్రభావానికి లోనై అలాంటి వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చుకుంది. ఇది తన చివరి తప్పిదమని కూడా చెప్పింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తప్పుదారి పట్టిన పిల్లలను క్షమించాలని అభిప్రాయపడ్డారు. వారిని శిక్షించడం, కోర్టుల చుట్టూ తిప్పడం వల్ల ప్రయోజనం ఉండదని అన్నారు.


బాలిక తల్లి కూడా ఈ ఉదంతంపై స్పందించారు. తన కుమార్తెను క్షమించిన ప్రధాని ఆమెకు జీవనదానం చేశారని అన్నారు. బాలికపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా వాడకుండా మైనర్లపై నిషేధం ఉండాలని కూడా అభిప్రాయపడ్డారు.


ఈ వార్తలనూ చదవండి:

ఎఫ్‌ఐఆర్ ఇంకా వెనక్కు తీసుకోలేదు.. ప్రధాని క్షమించినా.. బాలిక తల్లి ఆవేదన

విషాదం.. చిప్స్ ప్యాకెట్‌లో వచ్చిన ప్లాస్టిక్ బంతి తిని చిన్నారి మృతి

Updated Date - Aug 03 , 2026 | 10:14 AM