పహల్గామ్ ఉగ్రదాడి కేసు.. ఎల్ఈటీ చీఫ్ హఫీద్ సయీద్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్..
ABN , Publish Date - Jul 14 , 2026 | 11:39 AM
పహల్గామ్ ఉగ్రదాడి కేసులో లష్కరే తయ్యిబా (LeT) చీఫ్ హఫీజ్ సయీద్‌పై స్పెషల్ ఎన్ఐఏ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జులై 8వ తేదీన కోర్టు హఫీజ్ సయీద్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జమ్మూకశ్మీర్, జులై 14: పహల్గామ్ ఉగ్రదాడి కేసులో లష్కరే తయ్యిబా (LeT) చీఫ్ హఫీజ్ సయీద్‌పై స్పెషల్ ఎన్ఐఏ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జులై 8వ తేదీన కోర్టు హఫీజ్ సయీద్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పహల్గాం దాడిపై విచారణ జరుపుతున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) జులై 6వ తేదీన ఈ కేసుకు సంబంధించి స్పెషల్ ఎన్‌ఐఏ కోర్టులో అనుబంధ చార్జ్‌షీట్ దాఖలు చేసింది.
పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ఎల్ఈటీ అధినేత హఫీజ్ సయీద్‌పై పలు అభియోగాలతో ఈ అనుబంధ చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. సయీద్‌పై ఉపా చట్టంతో పాటు భారతీయ న్యాయసంహితలోని పలు సెక్షన్ల కింద ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. జులై 8వ తేదీన ఎన్ఐఏ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను కోర్టు పరిశీలించింది. ప్రాథమికంగా నిందితుడిపై మోపిన అభియోగాలకు తగిన ఆధారాలు ఉన్నాయని భావించి, కేసును విచారణకు స్వీకరించింది. నిందితుడిపై నాన్-బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది.
ట్రయల్ ఇన్ అబ్సెన్షియా..
పాకిస్థాన్‌లో ఉన్న సయీద్ ఇండియాకు రాకపోయినప్పటికీ విచారణ కొనసాగనుంది. 2024లో అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టం 'భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) - 2023'లోని సెక్షన్ 356 ప్రకారం.. నిందితుడు అందుబాటులో లేకపోయినా అతనిపై విచారణ జరిపి శిక్ష వేయవచ్చు. దీన్నే 'ట్రయల్ ఇన్ అబ్సెన్షియా' అంటారు.
ఇవి కూడా చదవండి
బిగ్‌బాష్ లీగ్ షెడ్యూల్ విడుదల.. చెన్నైలో తొలి మ్యాచ్..
గురువారం జాతిని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగం.. ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక ప్రకటనపై ఉత్కంఠ..