ఇది వర్సిటీ.. ఆర్‌ఎస్సెస్ శాఖ కాదు
ABN , Publish Date - Apr 29 , 2026 | 06:20 AM
దేశ రాజధానిలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం మరోసారి నిరసనలతో హోరెత్తింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్...
ఢిల్లీ జామియాలో ఆర్‌ఎస్సెస్ శతాబ్ది వేడుకలపై విద్యార్థుల నిరసన
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: దేశ రాజధానిలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం మరోసారి నిరసనలతో హోరెత్తింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్సెస్) శతాబ్ది వేడుకల సందర్భంగా క్యాంప్‌సలో నిర్వహించిన ‘యువ కుంభ్’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మంగళవారం భారీ సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు ఈ వేడుకలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఎస్‌ఎ్‌ఫఐ, ఏఐఎ్‌సఏ వంటి వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరిగాయి. ‘‘జామియా మా యూనివర్సిటీ.. మీ శాఖ కాదు’’, ‘‘కాషాయీకరణ వద్దు’’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అంటూ విద్యార్థులు నినదించారు. సాధారణ విద్యార్థి సంఘాలు చర్చలు జరుపుకోవాలన్నా ఆంక్షలు విధించే యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్, ఆర్‌ఎస్సెస్ వంటి సంస్థలను ఏసీ హాళ్లలో భారీ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఎలా అనుమతించిందని విద్యార్థి నేతలు ప్రశ్నించారు. వేల సంఖ్యలో మైనారిటీ విద్యార్థులు చదువుకునే ఈ క్యాంప్‌సలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వారి గౌరవానికి భంగం కలిగించడమేనని ఎస్‌ఎ్‌ఫఐ పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ రంగాలకు లాభమే..