Share News

జంతర్‌మంతర్‌ వద్ద అలజడికి కుట్ర

ABN , Publish Date - Aug 03 , 2026 | 05:35 AM

పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌ (జేఈఎం) కుట్రను పశ్చిమబెంగాల్‌ పోలీసులు భగ్నం చేశారు. జంతర్‌ మంతర్‌ వద్ద విద్యార్థుల నిరసనను హింసాత్మకంగా మార్చడంతోపాటు...

జంతర్‌మంతర్‌ వద్ద అలజడికి కుట్ర

  • బెంగాల్‌ సీఎంపైనా దాడికి సన్నాహాలు

  • జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ

  • అనుబంధ ముఠా నుంచి ఆదేశాలు

  • హనీట్రా్‌పతో కీలక సమాచారం సేకరణ

  • మంత్రి కుమారుడి కిడ్నా్‌పతో

  • భారీగా వసూలు చేసే పన్నాగం

  • అనుమానిత ఉగ్రవాది హమీమ్‌తో పాటు

  • అతని ప్రియురాలి అరెస్ట్‌

కోల్‌కతా, ఆగస్టు 2: పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌ (జేఈఎం) కుట్రను పశ్చిమబెంగాల్‌ పోలీసులు భగ్నం చేశారు. జంతర్‌ మంతర్‌ వద్ద విద్యార్థుల నిరసనను హింసాత్మకంగా మార్చడంతోపాటు, పశ్చిమబెంగాల్‌ సీఎం సువేందు అధికారి, ఇతర ప్రముఖులపైనా దాడికి కుట్రపన్నినట్టు తెలిసింది. అనుమానిత ఉగ్రవాది హమీమ్‌ మోండల్‌ను తొలుత పూర్బ బర్దమాన్‌ జిల్లాలో స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎస్‌టీఎఫ్‌) పోలీసులు అరెస్ట్‌ చేసి విచారించినప్పుడు ఈ విషయాలు తెలిశాయి. అతడికి సహకరించిన ప్రియురాలు, జార్ఖండ్‌కు చెందిన సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ అర్పితా సర్కార్‌ను సైతం రెండు రోజుల క్రితం అరెస్ట్‌ చేసిన పోలీసులు, కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వివరాలను పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎస్‌టీఎఫ్‌) ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ గౌరవ్‌ శర్మ వెల్లడించారు. పాక్‌ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు, అర్పితా సర్కార్‌తో ఓ ప్రముఖ మంత్రి కుమారుడికి ప్రేమ వలవేసి (హనీట్రాప్‌), అనంతరం రూ.50-60కోట్లు రాబట్టి, భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించాలన్న ప్రణాళిక రచించారు. ఇదే విధంగా పశ్చిమబెంగాల్‌ సీఎం కదలికల సమాచారాన్ని కూడా సేకరించాలని కోరారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద విద్యార్థుల నిరసనల్లోకి, పోలీసు డ్రెస్‌తో బృందంగా చొచ్చుకుపోయి అశాంతిని రాజేయాలని జేఈఎం అనుబంధ షెహజాద్‌ భట్టి ముఠా నుంచి హమీమ్‌ మోండల్‌కు ఆదేశాలు వెళ్లాయి. కానీ, ఆలోపే వీరి కుట్రను పోలీసులు భగ్నం చేశారు. విదేశాల నుంచి పనిచేస్తున్న ఆరు సోషల్‌ మీడియా అకౌంట్లు, వాట్సాప్‌ నంబర్లతో హమీమ్‌ సంభాషణల వివరాలను పోలీసులకు సేకరించారు. అతడు దేశీయంగా ఒక నెట్‌వర్క్‌ను నడిపిస్తున్నాడని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..

వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..

Updated Date - Aug 03 , 2026 | 05:35 AM