Share News

2027లో కులశేఖరపట్నం నుంచి తొలి రాకెట్‌ ప్రయోగం: ఇస్రో చైర్మన్‌ నారాయణ్‌

ABN , Publish Date - Nov 06 , 2026 | 06:19 AM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటకు ప్రత్యామ్నాయంగా సిద్ధం చేస్తున్న రాకెట్‌ ప్రయోగ కేంద్రం త్వరలోనే అందుబాటులోకి రానుంది

2027లో కులశేఖరపట్నం నుంచి   తొలి రాకెట్‌ ప్రయోగం: ఇస్రో చైర్మన్‌ నారాయణ్‌
isro

చెన్నై, నవంబరు 5: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటకు ప్రత్యామ్నాయంగా సిద్ధం చేస్తున్న రాకెట్‌ ప్రయోగ కేంద్రం త్వరలోనే అందుబాటులోకి రానుంది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్నంలో నిర్మిస్తున్న ఈ లాంచ్‌ ప్యాడ్‌ నుంచి వచ్చే ఏడాది తొలి రాకెట్‌ను ప్రయోగిస్తామని ఇస్రో చైర్మన్‌ వి. నారాయణన్‌ వెల్లడించారు. పెరియార్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సెంటర్‌లో గురువారం సోవియెట్‌ వ్యోమగామి యూరీ గగారిన్‌ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారాయణన్‌ మాట్లాడుతూ.. కొత్త లాంచ్‌ప్యాడ్‌ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. భారత అంతరిక్ష కార్యక్రమాలకు ముఖ్యంగా మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’కు రష్యా అందిస్తున్న సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Nov 06 , 2026 | 06:44 AM