‘గగన్‌యాన్’ మరింత ఆలస్యం!
ABN , Publish Date - Nov 21 , 2026 | 01:31 AM
భారతదేశ ప్రతిష్టాత్మక మానవసహిత అంతరిక్ష ప్రయోగం ‘గగన్‌యాన్’ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ, నవంబరు 20: భారతదేశ ప్రతిష్టాత్మక మానవసహిత అంతరిక్ష ప్రయోగం ‘గగన్‌యాన్’ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మొదట మానవ రహిత మిషన్ (జీ1)ను ఈ ఏడాది డిసెంబరులో చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకోగా.. అది వచ్చే ఏడాది ఫిబ్రవరి కంటే ముందు కూడా జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న సాంకేతిక సర్దుబాట్లు, అదనపు సిమ్యులేషన్లు, వాలిడేషన్ ప్రక్రియల కారణంగా ప్రయోగానికి పెట్టుకున్న గడువు దాటిపోయే అవకాశం ఉందని ఇస్రో అధికార వర్గాలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి..
ఇన్‌ఫ్లుయెన్సర్ ఇంట్లోకి చొరబడి పెళ్లి చేసుకోవాలని డిమాండ్.. యువకుడిని కొట్టి చంపిన ఫ్యామిలీ
తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..