ఇస్రోకు అగ్ని పరీక్ష!
ABN , Publish Date - Sep 04 , 2026 | 05:24 AM
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈవోఎస్-05 ఉపగ్రహ ప్రయోగం నేపథ్యంలో తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన షార్‌లో సందడి వాతావరణం నెలకొంది.
జీఎస్ఎల్వీ-ఎఫ్17 రాకెట్‌తో ఈవోఎస్-05ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధం
సూళ్లూరుపేట, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈవోఎస్-05 ఉపగ్రహ ప్రయోగం నేపథ్యంలో తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన షార్‌లో సందడి వాతావరణం నెలకొంది. షార్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్17 రాకెట్ ద్వారా శుక్రవారం తెల్లవారుజామున 2:55 గంటలకు నిర్వహించ తలపెట్టిన ఈ ప్రయోగం ఇస్రోకు అగ్నిపరీక్షగా నిలవనుంది. గత రెండు పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలు విఫలమవడం, అలాగే గత జీఎస్ఎల్వీ-ఎఫ్10 ప్రయోగం కూడా నిరాశను మిగల్చడంతో.. ఈ ప్రయోగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్‌లో అందరూ గాఢ నిద్రలో ఉండగా (శుక్రవారం తెల్లవారుజామున 2.55 గంటలకు) ఈ ప్రయోగం జరగనుంది. ఈ ఉపగ్రహ బరువు 2,367 కేజీలు. భూమికి 36వేల కి.మీ. ఎత్తులోని జియో సింక్రోనస్ ఆర్బిట్ (భూస్థిర కక్ష్య)లో దీనిని ప్రవేశపెట్టనున్నారు. భారత్‌లో జియోసింక్రోనస్ కక్ష్య నుంచి పనిచేయనున్న ఈ ఉపగ్రహం భారత భూభాగాన్ని నిరంతరం గమనిస్తూ ఉంటుంది. ప్రతి అర్ధ గంటకు ఒకసారి భారత్, దాని సరిహద్దులు, పొరుగు దేశాల భూభాగాలను హైరిజల్యూషన్‌తో ఫోటోలు తీస్తుంది. ఏదైనా ప్రాంతాన్ని మరింత నిశితంగా పర్యవేక్షించాల్సి వస్తే.. 5 నిమిషాల వ్యవధిలోనే దానికి సంబంధించిన హెచ్‌డీ ఫొటోలను గ్రౌండ్‌స్టేషన్‌కు పంపిస్తుంది. తుఫానులు, వరదలు, మేఘ విస్ఫోటనం వంటి ప్రమాదాలను ఎప్పటికప్పుడు అంచనా వేయనుంది.
ఇవి కూడా చదవండి
మేడ్ ఇన్ ఇండియా బైక్‌పై బ్రిటన్ ప్రధాని.. ఆనంద్ మహీంద్రా ఫుల్ ఖుష్